అప్పు చేసి ప‌ప్పు కూడు తిను అన్న‌ట్లుగా ఉంది.. ఆయ‌న ఏమ‌న్నారంటే..

అప్పు చేసి ప‌ప్పు కూడు తిను అని ఓ సినిమాలో ఉన్న‌ట్లు ఇప్పుడు మ‌నం కూడా అదే చేయాల‌ని చెబుతున్నారు. కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబ‌రం చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. కేంద్ర ప్ర‌భుత్వాన్ని ఉద్దేశించి ఆయ‌న ప‌లు సూచ‌న‌లు చేశారు.

కేంద్ర ప్ర‌భుత్వం అంత‌ర్జాతీయ సంస్థ‌ల నుంచి రుణాలు తీసుకోవాల‌ని చిదంబ‌రం అన్నారు. ఎందుకంటే దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను పున‌రుద్ధ‌రించాలంటే ప్ర‌జ‌ల వినియ‌మ శ‌క్తిని పెంచేదిశగా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. అంటే దేశంలో 50 శాతం అడ్డ‌డుగున ఉన్న పేద కుటుంబాల‌కు న‌గ‌దు బ‌దిలీ చేయాల‌న్నారు. ఆహార ధాన్యాలు సైతం అంద‌జేయాల‌ని సూచించారు.

రాష్ట్రాల‌కు ఇవ్వాల్సిన జీఎస్టీ నిధుల‌తో పాటు మౌళిక రంగంలో పెట్టుబ‌డులు పెంచాల‌న్నారు. ఈ చ‌ర్య‌ల‌తో ప్ర‌జ‌ల కొనుగోలు శ‌క్తి పెరుగుతుంద‌ని, దీంతో డిమాండ్ పెరిగి ఆర్థిక వ్య‌వ‌స్థ గాడిన ప‌డుతుంద‌న్నారు. ఇవ‌న్నీ జ‌ర‌గాలంటే అంత‌ర్జాతీయ సంస్థ‌ల‌తో కేంద్రం రుణాలు తీసుకోవాల‌న్నారు. మ‌రి చిదంబ‌రం మాట‌ల్ని మోడీ ప్ర‌భుత్వం పరిగ‌ణ‌లోకి తీసుకుంటుందో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here