13 ఏళ్ల బాలిక‌పై అత్యాచారం.. ఘ‌ట‌న‌లో పోలీస్‌, ఇద్ద‌రు సెక్యూరిటీ గార్డులు కూడా..

దేశంలో అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ఎన్ని చ‌ట్టాలు తెచ్చినా కామాంధులు మాత్రం రెచ్చిపోతూనే ఉన్నారు. ఒడిశాలో 13 ఏళ్ల బాలిక‌పై కామాంధులు అత్యాచారానికి పాల్ప‌డ్డారు. రెండు నెల‌ల క్రితం జ‌రిగిన ఈ ఘ‌ట‌న ఇప్పుడు ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.

వివ‌రాల్లోక వెళితే బాలిక త‌ల్లి ఓ టీవీ చాన‌ల్‌లో ప‌ని చేస్తోంది. దీంతో ఇద్ద‌రూ క‌లిసి భువ‌నేశ్వ‌ర్‌లోని ఇన్ఫోసిటీ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఈ నేప‌థ్యంలో దీంతో ఆమె డ్యూటీకి వెళ్ల‌గా ఆమె స‌హ‌చ‌ర ఉద్యోగులు ఇంటికి వచ్చి ఈ అఘాయిత్యానికి పాల్ప‌డ్డారు. అత్యాచారం చేసిన వారిలో ఓ పోలీస్‌తోపాటు, ఇద్ద‌రు ప్రైవేటు సెక్యూరిటీ గార్డులు, మ‌రో ఇద్ద‌రు వ్య‌క్తులు ఉన్నారు.

అయితే విష‌యం బ‌య‌ట‌కు చెబితే చంపేస్తామ‌ని బెదిరించ‌డంతో ఆ బాలిక విష‌యాన్ని ఎవ్వ‌రికీ చెప్ప‌లేదు. ఇటీవ‌లె త‌ల్లికి చెప్ప‌డంతో ఆమె వెళ్లి వారిని నిల‌దీసింది. ఆమెను కూడా బెదిరించంతో చేసేదేమీ లేక మౌనంగా ఉండింది. అయితే ఇటీవ‌ల త‌న సొంతూరు వెళ్లి వచ్చి పోలీస్ స్టేష‌న్లో ఫిర్యాదు చేసింది. నిందితుల‌ను ప‌ట్టుకునేందుకు పోలీసులు గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here