చిన్న పిల్ల‌ల‌పై క‌రోనా ప్ర‌భావం ఈ విధంగా ఉంటుందా.. జాగ్ర‌త్త మ‌రీ..

క‌రోనా మ‌హమ్మారి చిన్న పిల్ల‌ల‌పై తీవ్ర ప్రభావం చూపే అవ‌కాశం ఉంటుంద‌ని ఓ అధ్య‌య‌నంలో తేలింది. అయితే క‌రోనా సోకిన తొలి రోజుల్లో ఇది అంత ప్ర‌భావం చూప‌ద‌ని.. రెండు మూడు వారాల త‌ర్వాత దీని ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంటుంద‌ని తెలుస్తోంది.

కోవిడ్ సోకిన త‌ర్వాత వ‌చ్చే స‌మ‌స్య‌లు ఇప్పుడు భ‌యాందోళ‌న‌కు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా పిల్ల‌ల గుండెపై ఇది ప్ర‌భావం చూపుతుంద‌ట‌. కోవిడ్ సోకిన పిల్ల‌ల గుండెల‌ను జీవితాంతం ప‌ర్య‌వేక్షించాల్సి ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు. శ‌రీరానికి ఆక్సిజ‌న్ స‌హిత ర‌క్తాన్ని స‌ర‌ఫ‌రా చేసే సామ‌ర్థ్యం గెండెకు త‌గ్గిపోతుంద‌ని చాలా మంది పిల్ల‌ల్లో వెల్ల‌డైన‌ట్లు అద్య‌య‌నంలో వెల్ల‌డైంది.

ఈ పిల్లల్లో అక్క‌డ‌క్క‌డా సిర‌ల్లో వాపు క‌నిపించిన‌ట్లు తెలుస్తోంది. అయితే ఈ ల‌క్ష‌ణాలు మ‌ళ్లీ తిరిగి వ‌చ్చే అవ‌కాశం ఉండ‌టంతో ఈ పిల్ల‌ల‌ను అప్పుడ‌ప్పుడూ జీవిత‌కాలం ప‌రిశీలించాల్సి ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు. గుండె క‌న‌జాలం కూడా దెబ్బ‌తినేటట్లు ఉంటుంద‌న్నారు. దీనిబ‌ట్టి చిన్న పిల్ల‌లు ఉన్న వాళ్లు మ‌రింత జాగ్ర‌త్త‌గా ఉండాల్సిన అవ‌స‌రం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here