బీజేపీలోకి అచ్చెన్నాయుడు నిజంగా వెళ్తున్నారా..

ఏపీ రాజ‌కీయాల్లో భ‌గ్గుమ‌నే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. టిడిపి సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు టిడిపిని వీడేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఆయ‌న బీజేపీలో చేరిపోయేందుకు సానుకూలంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది.

ఇటీవ‌ల ఈఎస్ఐ స్కాంలో ఆయ‌న కేసులు ఎదుర్కొన్న విష‌యం తెలిసిందే. మొన్న‌ అచ్చెన్న బెయిల్‌పై విడుద‌లై బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఆయ‌న్ను అరెస్టు చేసిన ద‌గ్గ‌ర నుంచి బెయిల్‌పై విడుద‌ల అయ్యే వ‌ర‌కు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో వైసీపీ దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఇందుకు భారీ మెజార్టీతో గెల‌వ‌డ‌మే అవ్వొచ్చు. ఇక టిడిపి మాత్రం పూర్తిగా ఢీలా పడిపోయింద‌ని చెప్పొచ్చు.

ఇలాంటి ప‌రిస్థితుల్లో అధికార పార్టీలో ఉంటే మేల‌న్న ఫీలింగ్ ప్ర‌తి నాయ‌కుడిలో ఉంటుంది. ఇక అచ్చెన్నాయుడు విష‌యానికి వ‌స్తే పార్టీ మార‌టానికి ఏమాత్రం అడ్డంకులు లేవు. ఇటీవ‌లె ఆయ‌న అన్న‌కుమారుడు ఎంపీ రామ్మోహ‌న్ నాయుడు కూడా బీజేపీలో చేరుతారా అన్న పుకార్లు వ‌చ్చాయి. ఇప్పుడు అచ్చెన్నాయుడు కూడా బీజేపీ వైపు చూస్తున్నార‌న్న వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే వీరిద్ద‌రూ బీజేపీలో చేరేందుకు పెద్ద‌గా ఆలోచించాల్సిన అవ‌స‌రం లేదు.

రాష్ట్రంలో బీజేపీకి కూడా మంచి వాయిస్ ఉన్న నాయ‌కుడు కావాలి. అచ్చెన్న‌కు అది పుష్క‌లంగా ఉంది. ఈ ప‌రిస్థితుల్లో అచ్చెన్నాయుడును బీజేపీ క‌ళ్ల‌కుహ‌త్తుకొని స్వాగ‌తం ప‌లుకుతుంది. మ‌రి అచ్చెన్నాయుడు నిజంగా బీజేపీ వైపు చూస్తున్నారా అంటే తెలియ‌దు. ఒక వేళ బీజేపీలో చేరాల్సి వ‌స్తే ఆయ‌న కుటుంబం మొత్తం టిడిపిని వీడి బీజేపీలోకి వెళ్తుంది. ఇదే జ‌రిగితే చంద్ర‌బాబుకు భారీ షాక్ త‌గులుతుంది. అయితే అచ్చెన్నాయుడు బీజేపీలోకి వెళ్తార‌న్న దానిపై ఎలాంటి క్లారిటీ లేదు. కేవ‌లం ప‌లు పుకార్లు మాత్రం షికార్ చేస్తున్నాయి. ఏదిఏమైనా రాజ‌కీయాల్లో ఏదైనా జ‌ర‌గొచ్చ‌న్న‌ది మ‌న‌కు తెలిసిందే. మ‌రి అచ్చెన్న విష‌యంలో ఏం జ‌రుగుతుందో వేచి చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here