క‌రోనా పేషెంట్‌పై అంబులెన్స్ డ్రైవ‌ర్ అత్యాచారం..

క‌రోనా పేరు చెబితేనే జ‌నం బెంబేలెత్తిపోతున్నారు. కానీ కామాంధులు మాత్రం క‌రోనా పేషెంట్ల‌ను కూడా వ‌ద‌ల‌డం లేదు. క‌రోనా పేషెంట్‌పై అంబులెన్స్ డ్రైవ‌ర్ అత్యాచారం చేసిన ఘ‌ట‌న కేర‌ళ‌లో వెలుగు చూసింది. క‌రోనా రోగుల‌ను జాగ్ర‌త్త‌గా ఆసుప‌త్రికి చేర్చాల్సిన అంబులెన్స్ డ్రైవ‌ర్లు ఇలా అఘాయిత్యాల‌కు పాల్ప‌డ‌టం ప‌ట్ల స‌ర్వ‌త్రా ఆగ్ర‌హావేశాలు వ్య‌క్త మ‌వుతున్నాయి.

కేర‌ళ‌లోని పాథ‌న్‌మిట్ట ప్రాంతంలో నివాసం ఉంటున్న ఓ యువ‌తికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. దీంతో అంబులెన్స్‌లో ఆసుప‌త్రికి వెళ్లేందుకు బ‌య‌లుదేరింది. అయితే అంబులెన్స్ డ్రైవ‌ర్ ఆ క‌రోనా పేషెంట్‌ను అత్యాచారం చేయాల‌ని ప్లాన్ వేశాడు. అనుకున్న‌దే త‌డువుగా అంబులెన్స్‌ను నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంత‌రం ఆమెను హాస్పిట‌ల్స్‌కు తీసుకెళ్లి చేర్పించారు.

దీంతో ఆమె వెంట‌నే ఆసుప‌త్రి సిబ్బందికి స‌మాచారం అందించింది. పోలీసులు కేసు న‌మోదు చేసుకొని డ్రైవ‌ర్‌ను అదుపులోకి తీసుకున్నారు. క‌రోనా పేషెంట్ల ప‌ట్ల అత్యాచారానికి పాల్ప‌డుతున్న వారిని క‌ఠినంగా శిక్షించాల‌ని ప‌బ్లిక్ కోరుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here