నిజంగా ఇవి మంచి రోజులే జ‌గ‌న్ అన్నా..

ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవం సంద‌ర్బంగా వై.ఎస్ జ‌గ‌న్ మాట్లాడిన ప్ర‌తి మాట ఎంతో విలువైంది. ఎందుకంటే గ‌తంలో ఎలాంటి ప‌రిపాల‌న ఉండేది.. ఇప్పుడు ఏ విధ‌మైన మార్పు క‌నిపిస్తోందో అంద‌రికీ తెలిసిందే.

నేడు రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్స‌వాన్ని జ‌రుపుకుంటున్న ఏపీ ప్ర‌జ‌లు నిజంగా వై.ఎస్ జ‌గ‌న్ చెప్పిన మాట‌ల‌ను అర్థం చేసుకుంటున్నార‌ని చెప్పొచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో జ‌గ‌న్ అధికారం చేప‌ట్టిన అనంత‌రం చాలా మార్పులు తీసుకొచ్చారు. ప్ర‌ధానంగా పేద‌వాళ్ల‌కు ఎంతో ఉప‌యోగ‌క‌ర‌మైన పెన్ష‌న్ల‌ను ఆయ‌న పెంచారు. అంత‌టితో ఆగ‌కుండా పెన్ష‌న్ల‌ను ఇంటి వ‌ద్ద‌కే వ‌చ్చి ఇచ్చే విధానం తీసుకొచ్చారు. లేదంటే ఒక‌టో తేదీ వ‌స్తుందంటే చాలు పెన్ష‌న్ కోసం కార్యాల‌యం ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి వేచి ఉండాల్సిన పరిస్థితి ఉండేది.

ఎప్పుడైతే గ్రామ‌, వార్డు స‌చివాల‌యాలు, వాలంటీర్ల వ్య‌వ‌స్థ‌ను వై.ఎస్ జ‌గ‌న్ తీసుకొచ్చారో అప్ప‌టి నుంచి నిజంగా పేద ప్ర‌జ‌లు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. ఏ చిన్న ప‌ని కావాల‌న్నా వెంట‌నే వాలంటీర్ల‌ను సంప్ర‌దిస్తున్నారు. ఇక జ‌గ‌న్ చేస్తున్న మ‌రో ప‌ని నాడు నేడు పేరుతో పాఠ‌శాలల్లో స‌మూల మార్పులు తీకురావ‌డం. విద్యా వ్య‌వ‌స్థ‌లో మార్పులు తీసుకొచ్చి పేద‌వాళ్లు ప్ర‌శాంతంగా చ‌దువుకోవాల‌న్న ఉద్దేశం ఇక్క‌డ స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. అమ్మ ఒడి పేరుతో ప్ర‌తి త‌ల్లి అకౌంట్లో డబ్బులు జ‌మ చేయ‌డం నిజంగా రాష్ట్రంలో వ‌స్తున్న మార్పుల్లో ప్ర‌ధాన‌మైన‌ది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి.

రాష్ట్ర అవ‌త‌ర‌ణ వేడుక‌లు ఏపీలో ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవం సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ ఆదివారం ఉదయం తాడేపల్లిలోని క్యాంప్‌ ఆఫీస్‌లో జాతీయ జెండా ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం అమరజీవి పొట్టి శ్రీరాములుకు నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఆయ‌న మాట్లాడిన ప్ర‌తి విష‌యం ఎంతో కీల‌కం అని చెప్పొచ్చు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ విధ‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్నామో ఆయ‌న స్ప‌ష్టంగా చెప్పేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here