సోనూసూద్ గురించి మ‌రో న్యూస్‌.. ఆయ‌న ఇప్ప‌టికీ మార‌లేదు..

ఆప‌ద‌లో ఉండి అడిగితే తాను ఎంత‌వ‌ర‌కైనా స‌హాయం చేస్తాన‌ని సినీన‌టుడు సోనూసూద్ మ‌రోసారి నిరూపించారు. గ‌త ఆరు నెల‌లుగా ఆయ‌న ఎన్నో ర‌కాలు దేశ ప్ర‌జ‌ల‌కు సేవ చేస్తూనే ఉన్నారు. ప్ర‌జ‌ల నుంచి ఎన్నికైన ప్ర‌జా ప్ర‌తినిధులు ఎంత మేర‌కు సేవ చేస్తున్నారో కానీ సినీన‌టుడు సోనూసూద్ మాత్రం ఆయ‌న‌కు ఉన్న‌దంతా సేవ‌ల‌కే వినియోగిస్తున్నారు.

తాజాగా అనారోగ్యంతో బాద‌ప‌డుతున్న ఓ బాలిక‌ను సోనూసూద్ ఆదుకున్నారు. త‌క్ష‌ణ స‌హాయం చేయ‌డ‌మే కాకుండా ఎంత‌వ‌ర‌కైనా తానే భ‌రిస్తాన‌ని చెప్పారు. ఇంకో అడుగు ముందుకేసి ఆప‌రేష‌న్ ఖ‌ర్చు కూడా తానే పెడ‌తాన‌ని చెప్పి సోనూసూద్ మ‌రోసారి హీరో అయిపోయాడు. హైద‌రాబాద్‌లోని హ‌ఫీజ్‌పేట‌కు చెందిన మార‌య్య‌, స‌రస్వ‌తి దంప‌తుల కూతురు తేజ‌శ్రీ వ‌య‌స్సు 12 సంవ‌త్స‌రాలు. ఈమె చిన్న‌ప్ప‌టి నుంచీ గుండె సంబంధిత వ్యాధుల‌తో ఇబ్బందులు ప‌డుతూ ఉంది. ఈమెకు నెల‌కు మందుల కోసం రూ. 20వేల దాకా ఖ‌ర్చు వ‌స్తోంది. ప్ర‌తి నెలా ఇంత మొత్తంలో ఖ‌ర్చు పెడుతూ వీళ్లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు.

అయితే సోనూసూద్ మంచి మ‌న‌సును తెలుసుకున్న వీళ్లు హైద‌రాబాద్‌లో షూటింగ్ కోసం వ‌చ్చిన సోనూసూద్‌ను క‌లిశారు. త‌మ కూతురు ప‌రిస్థితిని వివ‌రించారు. స‌హాయం చేయ‌మ‌ని కోర‌గా ఆయ‌న ఏకంగా ఊహించ‌ని గిఫ్ట్ ఇచ్చేశారు. ఏదో కొంత స‌హాయం చేస్తార‌ని అంతా అనుకున్నారు. కానీ సోనూసూద్ ఆ పాప మందుల‌కు అవ‌స‌ర‌మైన మొత్తం స‌హాయం తానే చేస్తాన‌ని చెప్పారు. అంతేకాకుండా గుండె మార్పిడి చేయాల్సి వ‌స్తే.. అందుకు అవ‌స‌ర‌మైన డ‌బ్బులు కూడా తానే భ‌రిస్తాన‌ని త‌ల్లిదండ్రుల‌కు ధైర్యం చెప్పారు. సోనూసూద్ స‌హాయం చేసే మ‌న‌సు చూసి పాప త‌ల్లిదండ్రుల‌తో పాటు అక్క‌డున్న వారంతా షాక్‌కు గుర‌య్యారు. సోనూసూద్ మ‌రోసారి త‌న పెద్ద మ‌న‌సు చాటుకున్నార‌ని అంతా అనుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here