ఏపీ గురించి వై.ఎస్ జ‌గ‌న్ మాట్లాడిన వెంట‌నే స్పందించిన ప్ర‌ధాని మోదీ..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ గురించి ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ అవ‌త‌ర‌ణ దినోత్స‌వం సంద‌ర్బంగా మాట్లాడిన విష‌యం తెలిసిందే. అయితే ఏపీ అవ‌త‌ర‌ణ దినోత్స‌వాన్ని పుర‌ష్క‌రించుకొని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ సైతం ట్వీట్ చేయ‌డం ఇప్పుడు చ‌ర్చీనీయాంశం అవుతోంది.

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఏపీ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్స‌వం సంద‌ర్బంగా మోదీ ట్వీట్ చేశారు. అయితే తెలుగు, ఇంగ్లీషు రెండు భాష‌ల్లో ఆయ‌న ట్వీట్ చేయ‌డం విశేషం. ఆంధ్ర‌ప్ర‌దేశ్ కృషికి, స‌హృద‌య‌త‌కి మారుపేర‌ని చెప్పారు. ఆంధ్రులు అన్ని రంగాలలోనూ రాణిస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రావతరణ దినోత్సవ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ.. వారి అభివృద్ధికై ప్రార్ధిస్తున్నానని ట్వీట్ చేశారు.

అయితే రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం ఏపీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విష‌యం తెలిసిందే. ఈ ప‌రిస్థితుల్లో ఏపీకి కేంద్ర ప్ర‌భుత్వ స‌హ‌కారం చాలా అవ‌స‌రం. ప్ర‌ధానంగా ఇప్పుడు పోల‌వ‌రం ఇష్యూ న‌డుస్తోంది. ఏపికి పోల‌వ‌రం జీవ‌నాడి. అలాంటి ఈ ప్రాజెక్టు పూర్తి చేయ‌డానికి వేల కోట్ల రూపాయ‌లు కావాల్సి ఉంటుంది. అయితే పోల‌వ‌రం నిధులలో ప‌లు నిబంధ‌న‌ల మేర‌కే నిధులు ఇస్తామ‌ని కేంద్రం చెబుతోంది. దీనిపై ఇటీవ‌ల ఏపీ సీఎం జ‌గ‌న్ కూడా కేంద్రానికి లేఖ రాశారు. పోల‌వ‌రాన్ని కేంద్ర‌మే పూర్తి చేయాల‌ని కోరారు. మ‌రి దీనిపై మోదీ ట్వీట్ చేసింటే బాగుండేద‌ని ప‌లువురు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్ర‌జ‌లంతా ఇప్పుడు పోల‌వ‌రం గురించి మాట్లాడుకుంటున్న త‌రుణంలో ఏపీకి పోల‌వ‌రం పూర్తి చేసి ఇవ్వాల్సిన బాద్య‌త కేంద్రంపైనే ఉంది. మ‌రి పోల‌వ‌రం ప్రాజెక్టు విష‌యంలో కేంద్రం ఏ విధంగా ముందుకు వెళుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here