డబుల్ ఇంజిన్‌.. డ‌బుల్ డ‌బుల్ యువ‌రాజులు.. మోడీ షాకింగ్ కామెంట్స్‌..

బీహార్‌లో ఎన్నిక‌లు జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. దేశం మొత్తం బీహార్ వైపే చూస్తోంది. ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీల అగ్ర‌నేత‌లు బీహార్‌లోనే గ‌డుపుతున్నారు. దేశ ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీతో పాటు కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీలు బీహార్‌పై ఫోక‌స్ పెట్టారు.

నేడు బీహార్‌లోని ఎన్నిక‌ల ప్ర‌చారంలో మోదీ పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా మోదీ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి మాట్లాడుతూ రాహుల్ గాంధీతో పాటు, తేజ‌స్వీ యాద‌వ్‌ల‌పై విరుచుకుప‌డ్డారు. అయితే వీరిద్ద‌రి పేర్లు ప్ర‌స్తావించ‌కుండా మోదీ మాట్లాడారు. మోదీ ఏమ‌న్నారంటే..ఎన్డీయే ప్రభుత్వాన్ని డబుల్ ఇంజిన్‌తో పోల్చుతూ, ప్రతిపక్షాల కూటమిలో డబుల్-డబుల్ యువరాజులు ఉన్నారంటూ విరుచుకుపడ్డారు. ఉత్తర ప్రదేశ్‌లో డబుల్ యువరాజులకు పట్టిన గతే బిహార్‌లో యువరాజులకు పడుతుందని జోస్యం చెప్పారు.

నేడు మోదీ ప్ర‌చారంలో మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ సొంత గడ్డపై పాల్గొన్నారు. ప్ర‌తిప‌క్షాల‌ను ఉద్దేశించి ఆయ‌న మాట్లాడిన మాట‌లు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. బిహార్ ప్రజల ముందు డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉందని చెప్పారు. అయితే డ‌బుల్ డ‌బుల్ యువ‌రాజులు కూడా ఉన్నార‌న్నారు. అయితే వీరిలో ఒక‌రు ఆట‌విక పాల‌న‌ యువ‌రాజు అన్నారు. డబుల్ ఇంజిన్డ్ ఎన్డీయే ప్రభుత్వం బిహార్ అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. డబుల్ యువరాజులు తమ అధికార పీఠం కోసం పోరాడుతున్నారని చెప్పారు.

బీహార్ ఎన్నిక‌ల్లో మోదీ ఈ విధంగా మాట్లాడ‌టం ఇదే మొద‌టిసారి అనుకోవ‌చ్చు. ఎందుకంటే ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న ప్ర‌చార స‌భ‌ల్లో పాల్గొన్నా ఈ విధంగా యువ‌రాజులంటూ వ్యాఖ్య‌లు చేసి ఇంత ఘాటుగా మాట్లాడ‌టం ఇదే మొద‌టిసారి. మ‌రి దీనిపై రాహుల్, తేజ‌స్వీ యాద‌వ్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here