అక్క‌డ మొట్ట‌మొద‌టి సారి మ‌లేరియా కేసు..

దేశంలో ఎక్క‌డ చూసినా క‌రోనా విజృంభిస్తోంది. ప్ర‌స్తుతం క‌రోనా సెకండ్ వేవ్ కొన‌సాగుతోంది. ఈ ప‌రిస్థితుల్లో ప్ర‌జ‌లు ఇత‌ర వ్యాధుల‌ను ఏ మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేదు. ఇదే స‌మ‌యంలో మలేరియాతో ఓ బాలిక మృతి చెందింది. నాలుగేళ్ల త‌ర్వాత అక్క‌డ ఇప్పుడు మ‌లేరియా కేసు న‌మోదైంది.

దేశరాజధానిలో కరోనా విలయతాండవం మధ్య మలేరియా కేసు వెలుగు చూసింది. చాలా ఏళ్ల తరువాత రాజధానిలో మలేరియాతో ఒక బాలిక మృతిచెందిన ఉదంతం చోటుచేసుకుంది. ఢిల్లీ ఆరోగ్యశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీలోని మదన్‌పూర్ ఖాదర్‌లోని జేజే కాలనీకి చెందిన ఆరేళ్ల బాలిక కరోనాతో కన్నుమూసింది. ఈ బాలిక గత సెప్టెంబరులో మృతి చెందింది. బాలికి మృతికి గల కారణాలు తెలుసుకునేందుకు రాష్ట్రప్రభుత్వం, మున్సిపల్ కార్యాలయం సంయుక్తంగా డెత్ రివ్యూ కమిటీని ఏర్పాటు చేశాయి.

ఆరోగ్య విభాగం అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఆ చిన్నారి మృతికి మలేరియానే కారణం. దీనిని బ్రెయిన్ ఫీవర్ అని కూడా అంటారు. కాగా ఆ బాలికను వ్యాధి ముదరక ముందే, ఆసుపత్రిలో చేర్పించి ఉంటే ఆమె బతికేదని వైద్యులు తెలిపారు. దీనికిముందు 2016 సెప్టెంబరులో మండావలీ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి మలేరియాతో బాధపడుతూ సఫ్దర్ గంజ్ ఆసుపత్రిలో మృతి చెందాడు. ఆరువాత ఈ నాలుగేళ్ల వ్యవధిలో మలేరియాతో ఒక్కరు కూడా మృతి చెందలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here