ఒక ముఖ్య‌మంత్రిపై మ‌రో ముఖ్య‌మంత్రి వ్యాఖ్య‌లు..

దేశంలోని రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు ఒక‌రిపై ఒక‌రు ఇన్‌డైరెక్ట్‌గా కామెంట్లు చేసుకోనున్నారు రాష్ట్రాల అభివృద్ధి విష‌యంలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్యానాథ్‌, మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి ఉద్ద‌వ్ ఠాక్రేలు ఏం చేస్తార‌న్న దానిపై ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఉత్కంఠ‌త నెల‌కొంది. వీరిలో ఒక‌రు బీజేపీ ముఖ్య‌మంత్రి అయ‌తే మ‌రొకరు బీజేపీ శ‌త్రు పార్టీ అయిన శివ‌సేన ముఖ్య‌మంత్రి.

నోయిడాలో ఫిల్మ్ సిటీ ఏర్పాటు చేయాలన్న సీఎం యోగి ప్రతిపాదన ప్రస్తుతం మహారాష్ట్ర, యూపీ మధ్య చిచ్చు రాజేసింది. ఫిల్మ్ సిటీ పెట్టుబడిదారులను బలవంతంగా, భయపెట్టి తీసుకెళ్తానంటే కుదిరే ప్రసక్తే లేదని సీఎం ఉద్ధవ్ తేల్చి చెప్పారు. ఇరు రాష్ట్రాల మధ్య పోటీతత్వం ఉండడం మంచిదే కానీ, బెదిరించి పెట్టుబడిదారులను తీసుకెళ్తే ఊరుకునే ప్రసక్తే లేదని ఉద్ధవ్ హూంకరించారు. యూపీ సీఎం యోగి నోయిడాలో ఫిల్మ్ సిటీ ఏర్పాటు చేయాలన్న దృఢ నిశ్చయంతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే బుధవారం మహారాష్ట్రలోని ఫిల్మ్ సిటీ పెట్టుబడిదారులతో సమావేశం కానున్నారు.

అయితే నోయిడాలో ఫిల్మ్ సిటీ ఏర్పాటుకు సీఎం ఉద్ధవ్ అంత సుముఖంగా లేరని సమాచారం. ‘‘ఇండియన్ మర్చంట్ ఆఫ్ కామర్స్ సమావేశంలో సీఎం ఉద్ధవ్ మాట్లాడుతూ ‘‘పారిశ్రామిక వేత్తలకు మహారాష్ట్ర అయస్కాంతం లాంటిది. పారిశ్రామికవేత్తలను ఇప్పటికీ ఆకర్షిస్తున్నాం. రాష్ట్రంలోని పెట్టుబడి దారులు ఎవ్వరూ బయటికి వెళ్లరు. అంతేకాదు.. బయటి రాష్ట్రాల వారు మహారాష్ట్రలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తారు. రాష్ట్రంలోని వారు రాష్ట్రంలోనే ఉంటారు.’’ అని సీఎం ఉద్ధవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here