వాటిలో నిజం లేదు: నాగచైతన్య

నాగచైతన్య కి అప్పట్లో సరైన హిట్టులేక బాధపడుతున్న సమయంలో ‘రారండోయ్ వేడుక చూద్దాం’ అనే సినిమాతో విజయం సాధించి హిట్ ట్రాక్ ఎక్కడం జరిగింది.ప్రస్తుతం చైతు  రెండు సినిమాలు చేస్తున్నాడు. అయితే ఈ క్రమంలో నాగచైతన్య .. రకుల్ కాంబినేషన్లో ఒక సినిమా రూపొందనుందనీ, గతంలో కృష్ణవంశీ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన సౌజన్య ఈ సినిమా ద్వారా దర్శకురాలిగా పరిచయం కానుందనే వార్త హల్ చల్ చేస్తోంది.

ప్రస్తుతం చైతూ చేస్తోన్న సినిమాలు పూర్తికాగానే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనున్నట్టు చెప్పుకుంటున్నారు. అంతేగాక మరొకటి  సమంతతో కలిసి సినిమా వస్తుంది అనే వార్తలు కూడా వి నపడటం జరిగాయి…అయితే తాజాగా ఈ ప్రచారంపై నాగచైతన్య స్పందిస్తూ బయటకు వచ్చిన వార్తలన్నీ అబద్ధం అని చెప్పాడు…ఈ సందర్భంగా నాగచైతన్య ఇంకా స్పందిస్తూ ప్రస్తుతం తాను ‘సవ్యసాచి’తో పాటు మారుతి  దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నానని అన్నాడు.

ఈ రెండు సినిమాలు ఆసక్తికరమైన కంటెంట్ తో  మలచబడుతున్నాయని చెప్పాడు. తదుపరి ప్రాజెక్టు ఏమిటనే విషయాన్ని తాను త్వరలోనే ప్రకటిస్తాననీ .. అప్పటివరకూ ఎలాంటి ప్రచారాలు నమ్మొద్దని స్పష్టం చేశాడు. ఈ విషయాలన్నీ ట్విట్టర్ ద్వారా తెలిపాడు నాగచైతన్య.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here