రాజకీయా ఎంట్రీ గురించి స్పష్టత ఇచ్చిన శ్రీకాంత్

టాలీవుడ్ అందాల నటుడు సీనియర్ యాక్టర్ హీరో శ్రీకాంత్ ఇండస్ట్రీలో అనేక విజయాలు సాధించిన హీరోగా పేరు సంపాదించుకున్నాడు. అంతేకాకుండా హీరోల పక్కన సపోర్తేడ్ పాత్రలు చేస్తు ప్రస్తుతం సినిమాలలో బిజీగా ఉన్నడు. ఇలా ఉండగా హీరో శ్రీకాంత్ తన కొడుకును ఇటీవల ఇండస్ట్రీకి పరిచయం చేసి సంచలనం సృష్టించాడు.ఈ  క్రమంలో హీరో శ్రీకాంత్ ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది.
ఈ సందర్భంగా రాజకీయాల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ రాజకీయాల్లోకి తాను ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లనని, ఆ విషయాన్ని చాలా స్పష్టంగా చెబుతున్నానని ప్రముఖ సినీ నటుడు శ్రీకాంత్ అన్నాడు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, జనసేన పార్టీ నుంచి పిలుపు వస్తే వెళతారా? అనే ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, రాజకీయాల్లోకి వెళ్లే ప్రసక్తే లేదని, రాజకీయాలపై తనకు అవగాహన లేదని అన్నారు.
అయితే, రాజకీయాల్లోకి ఎవరు వెళ్లినా సక్సెస్ కావాలని మాత్రం కోరుకుంటాను తప్ప, తాను మాత్రం వాటి జోలికి వెళ్లనని, వాటిలో ఇమడలేనని అన్నారు. ప్రస్తుతమున్న దృష్టి మొత్తం నా కొడుకు కెరీర్ మీదే ఉంది అని స్పష్టం చేశాడు శ్రీకాంత్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here