వరంగల్ జిల్లాకు మోనోరైలు

కేసీఆర్ సర్కార్ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి అనేక జిల్లాలలో వివిధ కార్యక్రమాలు చేపడుతూ టిఆర్ఎస్ పార్టీపై తెలంగాణ ప్రజలలో నమ్మకాన్ని కనపరుస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ జిల్లాకు మోనోరైలు ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్టును చేపట్టడానికి స్విట్జర్లాండ్ కు చెందిన ఇంటమిన్ ట్రాన్స్ పోర్టేషన్ కంపెనీకి చెందిన ఏడుగురు ప్రతినిధుల బృందం వరంగల్ లో పర్యటించారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాలను పరిశీలించారు.
రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇటీవల స్విట్జర్లాండ్ పర్యటనకు వెళ్లినప్పుడు వరంగల్ లో మోనో రైలు కోసం ఇంటమిన్ కంపెనీ దగ్గర ప్రతిపాదించారు. దీంతో, గతంలో ఒకసారి అధ్యయనం చేసిన కంపెనీ బృందం, సాధ్యాసాధ్యాలపై క్షేత్రస్థాయిలో ఇవాళ పరిశీలించింది. రూ.12 వందల కోట్ల ఖర్చుతో వరంగల్ లో మోనో రైలు ప్రాజెక్టుని ప్రారంభించాలని ప్రతిపాదిస్తున్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ టిఆర్ఎస్ పార్టీ చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్ర ప్రజలలో టిఆర్ఎస్ పార్టీపై నమ్మకాన్ని కలిగిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here