బిజెపి నిర్ణయానికి భయపడిపోతున్న చంద్రబాబు!

గత ఎన్నికలలో కలసి పోటీచేసిన బిజెపి టిడిపి పార్టీలు ప్రస్తుత రాజకీయ పరిణామాల మధ్య యుద్ద  వాతావరణం నెలకొంది. విభజన నేపథ్యంలో బీజేపీ టీడీపీ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ని కలిసి 2014 ఎన్నికలలో పర్యటనని చేపట్టి విభజన తర్వాత ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. అయితే అప్పటి ఎన్నికల పర్యటన అప్పుడు ఏపీ ప్ర‌జ‌ల‌కు అమ‌లుకాని వాగ్ధానాలు ఇచ్చి అధికారాన్ని చేప‌ట్టిన విష‌యం విధిత‌మే.
అయితే, ఇప్పుడు మోడీ స‌ర్కార్ చేసి ఓ ప్ర‌క‌ట‌న చంద్ర‌బాబు కుంప‌టిలో సెగ‌లు రేపుతోంది. ఇటీవ‌ల కాలంలో బీజేపీ నేత‌లు సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ ఏపీకి విడుద‌ల చేసిన నిధుల‌ను ఆధారాల‌తో స‌హా మీడియాకు వెల్ల‌డించారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీకి రూ.2 ల‌క్ష‌ల కోట్ల‌కు పైగా నిధుల‌ను మంజూరు చేశామ‌ని, అయితే, ఆ నిధుల‌ను ఎలా ఖ‌ర్చుపెట్టారో త‌మ‌కు నివేదిక పంపాల‌ని ఆదేశించారు. ఇలా బీజేపీ నేత‌లు కేంద్రం నిధుల‌పై నివేదిక అడ‌గ‌డంతో చంద్ర‌బాబు స‌ర్కార్ ఏమి చేయాలో తోచ‌క త‌ల‌లుప‌ట్టుకుంటోంద‌ట‌.
ఈ  క్రమంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ని రాష్ట్రానికి తీసుకువచ్చి రాష్ట్రానికి కేంద్రం ఎంత ఇచ్చింది చెప్పించాలని రాష్ట్ర బిజెపి నేతలు ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు  చంద్రబాబుకు రాష్ట్ర బిజెపి నాయకులు తీసుకున్న నిర్ణయం చెమటలు పట్టిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here