‘ఐ’ అమీ జాక్సన్ పెళ్లి?

బాలీవుడ్ బ్రిటిష్ సుందరి హాట్ ముద్దు గుమ్మ అమీ జాక్సన్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. అమీ జాక్సన్ తమిళ సినిమా ఇండస్ట్రీ ద్వారా దక్షిణాది చలనచిత్ర రంగంలో మంచి పాపులర్ హీరోయిన్ అయింది. ముఖ్యంగా ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా ‘ఐ’ సినిమాతో మంచి క్రేజీ హీరోయిన్ అయిపోయింది అమీ జాక్సన్.ప్రస్తుతము అమీ జాక్సన్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న రోబో 2. 0 సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.

అయితే తాజాగా ఈ అమ్మడు ప్రేమాయణం సాగిస్తుంది. జార్జ్ పానయోట్ అనే యువకుడితో డేటింగ్ చేస్తున్నట్టు బి టౌన్ మీడియా కోడై కూస్తుంది. దానికి తోడు ఇద్దరు కలిసి తెగ తిరిగేస్తున్నారు కూడా. వీరిద్దరి వ్యవహారం పై పుకార్లు షికారు చేస్తున్నాయి. సో త్వరలోనే వీరిద్దరూ ఒక ఇంటివారు అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.ప్రస్తుతం అమీ జాక్సన్ రజనీకాంత్ సినిమా రోబో షూటింగ్లో బిజీగా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here