వరుణ్ తేజ్ సినిమా డైరెక్టర్ తో అఖిల్

ఇటీవల తాజాగా విడుదలైన తొలిప్రేమ సినిమా తెలుగు బాక్సాఫీస్ దగ్గర అద్భుతంగా లాభాలు రాబట్టుకుంది. ఈ సినిమా దర్శకుడు వెంకీ అట్లూరి అద్భుతంగా తెరకెక్కించాడు ప్రేమకథను. ఈ క్రమంలో తొలిప్రేమ సినిమా భారీ హిట్ అవడంతో ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది యంగ్ హీరోలు వెంకీ అట్లూరి తో చేయడానికి పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో డైరెక్టర్ వెంకీ అట్లూరి మాత్రం అక్కినేని అఖిల్ తో సినిమా చేయడానికి రెడీ  అవుతున్నాడు.
ఇటీవల అఖిల్ నటించిన  ‘హలో’ సినిమా కూడా ఆశించినస్థాయిలో వసూళ్లు రాబట్టకపోవడంతో, ఈ సారి కథల విషయంలో అఖిల్ మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. యువ దర్శకులు తెచ్చిన కథలను వింటున్నాడు. దాంతో ఆయనకి ఒక లైన్ వినిపించడానికి వెంకీ అట్లూరి రెడీ అవుతున్నాడట. రేపో మాపో అఖిల్ ను కలుసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో వెంకీ అట్లూరి చెప్పే కథ అఖిల్ కి నచ్చితే మాత్రం వెంటనే సినిమా పట్టాలెక్కే స్తుందని తెలుస్తోంది. మరి డైరెక్టర్ వెంకీ అట్లూరి అఖిల్ ని ఏవిధంగా మెప్పిస్తాడో చూడాలి మరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here