సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు తెలిపిన ప్రియా ప్రకాష్ వారియ‌ర్!

తన కనుబొమ్మలతో హావభావాలతో సోషల్ మీడియాలో దేశంలో సంచలనం అయ్యింది మలయాళ ముద్దుగుమ్మ  ప్రియా ప్రకాష్ వారియ‌ర్. అయితే ఈ క్రమంలో ఈ మలయాళ ముద్దుగుమ్మ నటించిన ‘ఒరు ఆదార్‌ లవ్‌’ సినిమాలోని పాట వలన ఈమెపై హైదరాబాదులో కేసు నమోదు అవడం  జరిగింది. సినిమాలోని పాట తమ మనోభావాలు దెబ్బ తీసింది అంటూ ముస్లిం సోదరులు కేసు నమోదు చేశారు ప్రియా ప్రకాష్ వారియ‌ర్ పై.
ఈ నేపధ్యంలో ప్రియ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో.. అత్యున్నత న్యాయస్థానం నుంచి ఆమెకు సానుకూలంగా ఆదేశాలు వచ్చాయి.’సుప్రీంకోర్టుకి కృత‌జ్ఞ‌త‌లు.. ‘మాణిక్య మలరయా పూవై’ పాటపై అభ్యంతరాలు తెలుపుతూ నాపైన, మా దర్శ‌కుడు ఒమర్ లాలూపైన హైదరాబాద్‌లో నమోదైన ఎఫ్ఐఆర్ పై స్టే విధించడంతో పాటు ఇత‌ర ఏ ప్రాంతాల్లోనూ కేసులు నమోదు చేయొద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది.తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు ప్రియా ప్రకాష్ వారియ‌ర్ కి పెద్ద రిలీఫ్ అనిపించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here