ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు నిర్దోషి: ఏపీ మంత్రి

రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన కేసు ఓటుకు నోటు కేసు. ఈ కేసులో చంద్రబాబు నాయుడు పేరు రావడంతో దేశం మొత్తం రెండు తెలుగు రాష్ట్రాలను చూసింది. అప్పట్లో ఓటుకు నోటు కేసు సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు……రోజుకో రకంగా రాష్ట్రంలో రాజకీయం మారిపోయేది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పై పెత్తనం చెలాయించడం మొదలుపెట్టింది. ఒకానొక సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన జరుగుతుంది అన్నీ అన్నవారు కూడా ఉన్నారు.

ఓటుకు నోటు కేసు మొత్తం చంద్రబాబునాయుడు కన్నుసైగలోనే జరిగాయి ఆడియో టేపులు కూడా బయటకు వచ్చాయి. అయితే ప్రస్తుతం ఈ కేసు కోర్టులో ఉంది.ఓటుకు నోటు కేసులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాత్ర లేదని అంటున్నారు రాష్ట్ర మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.బాబు నిర్దోషి.ఈ కేసుకు బాబుకు ఏ మాత్రం సంబంధం లేదని ఆయన తేల్చేశారు.సోమిరెడ్డి వ్యాఖ్యలు వింటున్న రాజకీయ విశ్లేషకులు చూశావా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అత్యంత అమాయకులు అని అంటున్నారు…అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబును భలే కవర్ చేస్తూ మాట్లాడుతున్నారు మంత్రి అని ఎద్దేవా చేశారు రాజకీయ విశ్లేషకులు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here