అప్పుడు నేను చెప్ప‌గానే క‌రోనా దేశం నుంచి వెళ్లిపోయింది..

రాజ‌కీయ నాయ‌కులు చేసే ప్ర‌తి మాట ఎంతో విలువ ఉంటుంది. ఎందుకంటే వీరిని ప్ర‌జ‌లు ఫాలో అవుతూ ఉంటుంటారు. అందుకే పాలిటిక్స్‌లో మాట్లాడేముందు కొంచెం ఆలోచించాలి అంటారు. ఇప్పుడు కేంద్ర మంత్రులు చేస్తున్న వ్యాఖ్య‌లు ఇలానే ఉన్నాయి. క‌రోనాపై ఆయ‌న చేస్తున్న వ్యాఖ్య‌లు ఇప్పుడు అంద‌రినీ ఆలోచింప‌జేస్తున్నాయి.

కొత్త కరోనా స్ట్రెయిన్ వైరస్‌పై కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అప్పుడు ‘గో కరోనా, కరోనా గో’ అనే నినాదాన్ని తాను తీసుకొచ్చానని.. దీంతో కరోనా పోయిందని ఆయన చెప్పారు. ఇప్పుడీ కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్‌ కోసం ‘నో కరోనా, కరోనా నో’ అనే నినాదాన్నిస్తున్నానని కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే వ్యాఖ్యానించడం కొసమెరుపు. ఇదిలా ఉంటే.. అథవాలేకు అక్టోబర్‌లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయి.. చికిత్స తీసుకోవడంతో నయమయిన సంగతి తెలిసిందే.

వ్యాక్సిన్ రాగానే.. కరోనా మన దేశం నుంచి వెళ్లిపోతుందని పనాజీలో అథవాలే చెప్పారు. నెలారెండు నెలల్లో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పారు. కేంద్ర మంత్రి ఇలా క‌రోనాపై వ్యాఖ్య‌లు చేయ‌డం ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది. మ‌రి ఈ విష‌యంలో ఇత‌ర పార్టీల నేత‌లు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. కాగా ప్ర‌స్తుతం దేశంలో క‌రోనా కేసులు న‌మోద‌వుతూనే ఉన్నాయి. అయితే ఇండియాలో రిక‌వరీ రేటు ఎక్కువ‌గా ఉండ‌టం సంతోషించ‌ద‌గ్గ విష‌యం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here