థియేటర్లు తెరుచుకోనున్నాయి… కానీ మన దగ్గర కాదు.? 

కంటికి కనిపించని ఓ చిన్న వైరస్ యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. కరోనా కారణంగా అన్ని రంగాలు కనీవినీ ఎరుగని రీతిలో తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్నాయి. ఇందులో సినీరంగం ఒకటి..  కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగే సినిమా థియేటర్లు మూత పడటంతో ఎంతోమంది ఉపాధి కోల్పోయారు. ఇదిలా ఉంటే చిత్రీకరణకు ప్రభుత్వం అనుమతించినా…  థియేటర్లకు మాత్రం ఇంకా గ్రీన్ సిగ్నల్ లభించలేదు. ఈ క్రమంలో థియేటర్లు తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతాయన్నదానిపై ఓ క్లారిటీ లేదు. ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు థియేటర్లను తిరిగి ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వానికి విన్నవించిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే ఇలాంటి సమయాల్లో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన ప్రకటన అక్కడి సినీ అభిమానులకు, ఇండస్ట్రీలో పనిచేసేవారికి సంతోషాన్నిస్తోంది. పశ్చిమబెంగాల్ లో  అక్టోబరు 1 నుంచి థియేటర్లు ప్రారంభించడానికి అక్కడి ప్రభుత్వం అనుమతిచ్చింది. 50శాతం సీట్లతో భౌతిక దూరం, మాస్క్‌ ధరించడంలాంటి నిబంధనలతో జాగ్రత్తలు పాటిస్తూ థియేటర్లను తెరచుకోవచ్చని ముఖ్యమంత్రి తెలిపారు. ఇదిలా ఉంటే థియేటర్లు తెరవడంపై కేంద్రం నుంచి మాత్రం ఇంకా ఎలాంటి అనుమతులు రాలేవు. మరి మన తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్లు మళ్లీ ఎప్పుడు తెగుతాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here