మంత్రి పీఏను ఎత్తుకెళ్లి.. రూ. 10 ల‌క్ష‌లు డిమాండ్ చేశారు..

ఓ మంత్రి పీఏను కిడ్నాప్ చేసిన ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపుతోంది. అయితే ఇది చెన్నైలో జ‌రిగింది. ఆ రాష్ట్ర ప‌శుసంవ‌ర్ధ‌క శాఖకు మంత్రిగా ఉడుమలై రాధాకృష్ణ‌న్ వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఆయ‌న పీఏగా క‌ర్ణ‌ అనే వ్యక్తి విధులు నిర్వ‌ర్తిస్తున్నారు.

అయితే ఏమైందో ఏమో కానీ ఉన్న‌ట్టుండి ఈ నెల 23వ తేదీన మంత్రి పీఏ క‌ర్ణ‌ణ్ ఎమ్మెల్యే కార్యాల‌యంలో ఉండ‌గా ఆయ‌న అక్క‌డి నుంచి అదృశ్య‌మ‌య్యారు. కొంద‌రు వ్య‌క్తులు కార్యాల‌యంలోకి వ‌చ్చి ఆయ‌న్ను ఎత్తుకెళ్లారు. పీఏ క‌నిపించ‌క‌పోవ‌డంతో విష‌యం తెలుసుకున్న ఉడుమ‌లై పోలీసులు రంగంలోకి దిగ‌గా అస‌లు విష‌యం బ‌య‌ట ప‌డింది. మంత్రి పీఏ క‌ర్ణ‌ణ్ ద‌గ్గ‌ర డ‌బ్బులు ఉన్నాయ‌ని తెలుసుకున్న కొంద‌రు వ్య‌క్తులు ఆయ‌న్ను బెదిరించి డ‌బ్బులు లాక్కోవాల‌ని ప్ర‌య‌త్నించారు. ఈ వ్యవహారంలో రామస్వామినగర్‌కు చెందిన అన్నాడీఎంకే నాయకులు ప్రదీప్‌, అరుణ్‌కుమార్‌, సుందరేశన్‌, దేవరాజ్‌, తాక, వినోద్‌, సెల్వగణపతిని అరెస్టు చేశారు.

య‌న్ను ఎత్తుకెళ్లిన వీరు క‌ళ్ల‌కు గంత‌లు క‌ట్టి ఓ గోడౌన్‌లో ఉంచి రూ. 10 ఇవ్వాల‌ని బెద‌రించ‌గా ఆయ‌న అంత డ‌బ్బు త‌న వ‌ద్ద‌లేద‌ని చెప్పడంతో రూ. 50 వేలు తీసుకొని ప‌రార‌య్యారు. అయితే పొలం విక్ర‌యించిన సంద‌ర్బంగా మంత్రి పీఏ వ‌ద్ద డ‌బ్బులు ఉన్నాయ‌ని దుండ‌గులు తెలుసుకొని ఈ ప్లాన్ వేసిన‌ట్లు తెలుస్తోంది. స్వ‌యంగా మంత్రి పీఏ కే ఇలా బెదిరింపులు రావ‌డం రాష్ట్రంలో సంచ‌ల‌నం సృష్టించింది. ఇక సామాన్యుల ప‌రిస్థితి ఏంట‌న్న ఆందోళ‌న ప‌లువురు వ్య‌క్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here