క‌రోనా విష‌యంలో కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌..

క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచాన్నిం ఇంకా వ‌ణికిస్తూనే ఉంది. ఈ ప‌రిస్థితుల్లో ప్ర‌పంచం మొత్తం వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తోంది. దీంతో వ్యాక్సిన్ ఎప్పుడు వ‌స్తుందా అన్న సందేహాలు అంద‌రిలోనూ ఉన్నాయి. ఈ ప‌రిస్థితుల్లో ప‌లు వ్యాక్సిన్ కంపెనీలు మాత్రం అతి త్వ‌ర‌లోనే వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌చ్చి తీరుతుంద‌ని చెబుతున్నాయి. తాజాగా ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యూహెచ్‌వో) ఓ గుడ్ న్యూస్ చెప్పింది.

త్వ‌ర‌లోనే క‌రోనా ముగిసిపోయే అవ‌కాశం ఉంద‌ని డ‌బ్ల్యూహెచ్‌వో తెలిపింది. అయితే ఇక్క‌డ గ‌మ‌నించాల్సిన విష‌యం ఒక‌టి ఉంది. ఏంటంటే ఇన్ని రోజులు ప్ర‌జ‌లంతా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని.. ఈ ప‌రిస్థితులు కొన్ని సంవ‌త్స‌రాల పాటు కొన‌సాగుతాయ‌ని డ‌బ్ల్యూహెచ్‌వో చెబుతూ వ‌స్తోంది. అయితే ఫ‌స్ట్ టైం ఇలా క‌రోనా విష‌యంలో సానుకూలంగా డ‌బ్ల్యూహెచ్‌వో త‌రుపు నుంచి మాట‌లు రావ‌డం ఆలోచించాల్సిన విష‌య‌మే. ఎంతో క‌చ్చిత‌మైన స‌మాచారం ఉంటేనే ఈ ప్ర‌క‌ట‌న వ‌స్తుంద‌ని అంద‌రూ అనుకుంటున్నారు.

క‌రోనాపై ఐక్య‌రాజ్య‌సమితి నిర్వ‌హించిన సాదారణ స‌భ‌ సమావేశంలో డబ్ల్యూహెచ్‌వో డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ టెడ్రోస్ అధ‌నామ్ మాట్లాడారు. ఈ స‌మ‌యంలో ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. క‌రోనా వ్యాక్సిన్ వ‌స్తే ప్ర‌పంచ దేశాల‌న్నింటికీ అందాల‌న్నారు. పేద‌, ధ‌నిక అనే తేడా ఉండ‌కూడ‌ద‌ని చెప్పారు. ధ‌నిక దేశాలు పేద దేశాల‌పై ఆదిపత్యం చూప‌కూడ‌ద‌ని తెలిపారు. క‌రోనా వచ్చిన త‌ర్వాత ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న మంచితో పాటు చెడు కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింద‌న్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here