ఢిల్లీలో రైతుల‌కు మ‌ద్ద‌తుగా నిలుస్తున్న సెల‌బ్రెటీలు..

ఇటీవ‌ల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్య‌వ‌సాయ చ‌ట్టాలను రైతులు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో దేశ రాజ‌ధానిలో ఆందోళ‌న‌లు కూడా చేప‌డుతున్నారు. దీంతో దేశ వ్యాప్తంగా రైతుల‌కు మ‌ద్ద‌తు పెరుగుతోంది. సామాన్యుల నుంచి సెల‌బ్రెటీల వ‌ర‌కు అంద‌రూ రైతుల‌కు త‌మ మ‌ద్ద‌తు తెలుపుతున్నారు.

రైతులు ఓవైపు ఆందోళనలు కొనసాగిస్తుంటే తాను ఊరేగింపుగా వెళ్లడం ఇష్టంలేని ఓ పెళ్లికొడుకు సాదాసీదా రీతిలో ట్రాక్టర్‌లో వివాహ మండపానికి తరలి వెళ్లాడు. హర్యానాలోని కర్నల్‌కు చెందిన పెళ్లికొడుకు సొంతగా వ్యాపారం చేసుకుంటున్నాడు. లగ్జరీ కారు కూడా ఉంది. అయితే, తన కుటుంబ మూలాలన్నీ సేద్యంతో ముడిపడి ఉన్నాయని, రైతులకు సంఘీభావంగానే ఈ నిర్ణయం తీసుకున్నానని పెళ్లికొడుకు తెలిపాడు.

ఇప్పుడు పంజాబీ గాయకుడు, నటుడు హర్భజన్ మన్ సంఘీభావం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం శిరోమణి పంజాబీ అవార్డును తాను తిరస్కరిస్తున్నట్లు హర్భజన్ ప్రకటించారు. పంజాబ్ భాషా విభాగం గురువారం సాహిత్యరత్న, శిరోమణి అవార్డులను హర్భజన్ కు ప్రకటించింది. ‘‘నేను శిరోమణి అవార్డుకు ఎంపికైనందుకు కృతజ్ఞుడను, అయినప్పటికీ పంజాబ్ భాషా విభాగం నుంచి శిరోమణి అవార్డును నేను అంగీకరించలేను. ప్రజల ప్రేమ నా కెరీర్‌లో అతిపెద్ద అవార్డు, ప్రస్తుతం మనం శాంతియుత రైతుల నిరసనకు మద్ధతు ఇవ్వాలి’’అని హర్భజన్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. పలువురు పంజాబీ గాయకులు, కళాకారులు రైతుల ఆందోళనకు మద్ధతు ఇస్తున్నారు. హర్భజన్ ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల నిరసనలో పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here