మ‌హేష్ బాబు సినిమాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎంట్రీ..

ఇండ‌స్ట్రీలో ఇద్ద‌రు హీరోల‌తో ఓ సినిమా వ‌చ్చిందంటే దానిపై భారీ అంచ‌నాలే ఉంటాయి. అది స్టార్ హీరోలైతే ఆ సినిమా గురించి ఇంకా చెప్ప‌క్క‌ర్లేదు. ఇప్పుడు అదే టాపిక్ న‌డుస్తోంది. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు ఇద్ద‌రూ ఓ సినిమా చేస్తున్నార‌న్న టాక్ వినిపిస్తోంది.

చాలా రోజులుగా ఈ ఇద్ద‌రు స్టార్ హీరోలు క‌లిసి ఓ సినిమా చేయాల‌ని ఫ్యాన్స్ కోరుకుంటూనే ఉన్నాయి. ఇప్ప‌టికే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. విక్ట‌రీ వెంక‌టేష్‌తో కలిసి న‌టించిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు మ‌హేష్‌తో కూడా ప‌వ‌న్ సినిమా చేయాల‌ని అంద‌రూ ఆశిస్తున్నారు. అయితే ప్ర‌స్తుతం ఓ వార్త సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతోంది. అదేంటంటే.. మ‌హేష్ బాబు స‌ర్కారు వారి పాట సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్నార‌ని అంటున్నారు. ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేయ‌డానికి ప‌వ‌న్ ఓకే చెప్పార‌ని టాక్ న‌డుస్తోంది. అయితే కేవ‌లం ఐదు నిమిషాలు మాత్ర‌మే ప‌వ‌న్ పాత్ర ఉంటుంద‌ని పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై మాత్రం క్లారిటీ లేదు. కాగా చాలా గ్యాప్ త‌ర్వాత ఇప్పుడు ప‌వ‌న్ వ‌రుస‌గా సినిమాలు చేయ‌డానికి ఒప్పుకున్న సంగ‌తి తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here