దేవాల‌యాలు తెరుచుకుంటాయి.. కానీ ఈ నిబంధ‌న‌లు క‌చ్చితంగా పాటించాల్సిందే..

దేశంలో క‌రోనా వైర‌స్ విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉంది. అయిన‌ప్ప‌టికీ ఇండియాలో క‌రోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య ఎక్కువ‌గా ఉంది. 92 శాతం రిక‌వ‌రీ రేటు ఇండియాలో ఉంది. ఈ నేప‌థ్యంలో అన్‌లాక్ కొన‌సాగుతోంది. అయితే ఇండియాలో మ‌హారాష్ట్రలో కేసులు ఎక్కువ‌గా వ‌చ్చాయి. దీంతో మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటూ నిబంద‌న‌లు అమ‌లు చేస్తోంది.

అయితే మహారాష్ట్రలో ఆల‌యాలను ఇంకా తెర‌వ‌లేదు. ఇటీవ‌ల ద‌స‌రా లాంటి పెద్ద పండుగ వ‌చ్చినా ఆల‌యాలు తెర‌చుకోలేదంటే అక్క‌డి నిబంధ‌న‌లు అర్థం చేసుకోవ‌చ్చు. ఇప్పుడు దీపావ‌ళి కూడా ముగిసిపోయింది. దీంతో రాష్ట్రంలో ఆల‌యాలు ఓపెన్ చేయ‌డానికి ప్ర‌భుత్వం సిద్ద‌మైంది. అయితే ఓపెన్ చేయ‌డ‌మే కాకుండా ప‌క్కాగా ప‌లు మార్గ‌ద‌ర్శ‌కాలు కూడా ప్ర‌భుత్వం విడుద‌ల చేసింది. ఆల‌యాల‌కు వెళ్లాల‌నుకునే వారు క‌చ్చితంగా ఇవి పాటించాల్సిందే. కరోనా కారణంగా దాదాపు ఏడు నెలల పాటు ఆయా ప్రార్థనా మందిరాలను మూసేశారు.

ఈనెల‌ 16 నుంచి తిరిగి తెరుచుకోనున్న నేపథ్యంలో సీఎం ఉద్ధవ్ ప్రజలకు ఓ విజ్ఞప్తి చేశారు. కరోనా మహమ్మారి ఇంకా మన మధ్యనే ఉందని గుర్తుంచుకోవాల‌న్నారు. కోవిడ్ మార్గదర్శకాలను కట్టుబడి ఉండాల‌న్నారు. ఈ మహమ్మారి మెళ్లిమెళ్లిగా దెబ్బతింటున్నా పూర్తిగా పోయిందన్న ధీమాతో వ్యహరించకండన్నారు. కేవ‌లం కంటోన్మెంట్ జోన్లలో లేని దేవాలయాలు మాత్రమే తెరుచుకోనున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here