పాయల్ బరువు తగ్గింది అందుకేనట..

కేవలం సినిమాల్లో తన నటనతోనే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా అభిమానులను ఆకట్టుకుంటోంది నటి పాయల్ రాజ్ పుత్. సోషల్ మీడియా వేదికగా తన హాట్ ఫోటోలను ఎప్పటికప్పుడు పంచుకోవడం ఈ బ్యూటీకి అలవాటు. ఈ క్రమంలోనే తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పోస్ట్‌ చేసిన కొన్ని ఫోటోలు వైరల్ గా మారిన విషయం తెలిసిందే. జిమ్ వెయర్ లో దిగిన ఫోటోలను పోస్ట్ చేసిన పాయల్ కేవలం నెల రోజుల్లోనే 5 కిలోల బరువు తగ్గాను అంటూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కేవలం 30 రోజుల్లోనే 63 కిలోల నుంచి 58 కిలోలకు తగ్గిందీ బ్యూటీ.

ఇదిలా ఉంటే ఇంత తక్కువ సమయంలో 5 కిలోల బరువు తగ్గడానికి గల కారణాన్ని చెప్పుకొచ్చిన పాయల్.. ‘ఓ తెలుగు సినిమా కోసమే ఇంతలా బరువు తగ్గాను. అందులో నాది పేదరికంలో కొట్టుమిట్టాడే అమ్మాయి పాత్ర. ఓ పాత్ర కోసం నేను బరువు తగ్గడం ఇదే తొలిసారి. నిజానికి హైదరాబాద్ షిఫ్ట్ అయినప్పట్నుంచి నేను బరువు తగ్గుతూనే ఉన్నాను. ఎందుకంటే డైట్ విషయంలో చాలా కఠినంగా ఉంటున్నాను. ప్రతి రోజూ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 8 మధ్య మాత్రమే ఆహారం తీసుకున్నాను.. అందుకే ఇంత త్వరగా బరువు తగ్గాను’అని వివరణ ఇచ్చింది. సినిమాల పట్ల పాయల్ కు ఉన్న డెడికేషన్ ఎలాంటిదో చెప్పడానికి ఈ ఉదాహరణ చాలు కదూ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here