పెళ్లిళ్లు చేసుకొని పిల్ల‌ల్ని క‌నండి ప్లీజ్‌..

ఒక్కో దేశం ఒక్కోలా ఉంటుంది. భార‌త్‌తో పాటు ప‌లు దేశాల్లో జ‌నాభా ఎక్కువ‌గా ఉంటుంది. దీంతో అక్క‌డ జ‌నాభాను నియంత్రించ‌డానికి ఒక సంతానం లేదా ఇద్ద‌రు మాత్ర‌మే ఉండాల‌ని ప్ర‌భుత్వాలు చెబుతుంటాయి. అయితే మ‌రికొన్ని దేశాల్లో ప‌రిస్థితి చాలా డిఫ‌రెంట్‌గా ఉంటుంది.

ఇప్పుడు జ‌పాన్‌లో జ‌న‌నాల రేటు పెంచేందుకు దేశం క‌స‌ర‌త్తులు చేస్తోంది. ఎప్పుడూ ఉద్యోగాల్లో బిజీగా ఉండే ప్ర‌జ‌ల‌ను కాస్త పెళ్లిల్లు చేసుకొని పిల్ల‌ల్ని క‌నాల‌ని చెబుతోంది. ఇందుకోసం ప్ర‌త్యేకంగా డ‌బ్బులు ఇచ్చేందుకు కూడా సిద్ధ‌మైంది. రానున్న ఏప్రిల్ నెల నుంచి పెళ్లిళ్లు చేసుకునే జంట‌కు రూ. 4 ల‌క్ష‌ల‌కు పైగా డ‌బ్బులు ఇవ్వ‌నుంది. అంటే అక్క‌డి క‌రెన్సీలో ఆరు ల‌క్ష‌ల యెన్‌లు ఇస్తామ‌ని ప్ర‌భుత్వం చెబుతోంది. పెళ్లిళ్లు చేసుకున్న వారు కొత్త జీవితం ప్రారంభించ‌డానికి ఈ న‌గ‌దు ఉప‌యోగ‌ప‌డుతుందని ప్ర‌భుత్వం భావిస్తోంది.

మామూలుగా జ‌పాన్‌లో ప్ర‌జ‌లు చాలా బిజీగా ఉంటారు. ఒక్క‌సారి ఆఫీసుకు వెళ్లిన త‌ర్వాత ప‌ని ముగించుకొని ఇంటికి వెళ్లే టైప్ కాదు. ఓవ‌ర్ టైం డ్యూటీలు, అవ‌స‌ర‌మైతే ఎక్కువ షిఫ్టులు చేయ‌డానికి కూడా సిద్దంగా ఉంటారు. దీన్ని వ‌ల్ల ప్ర‌జ‌లు పెళ్లిళ్లు చేసుకునేందుకు కూడా సిద్దంగా లేరు. దీంతో కొన్ని సంస్థ‌లు త‌క్కువ ప‌ని చేయండి అని సూచిస్తున్నాయి. ప‌ట్టించుకోకుండా అలాగే ప‌ని చేస్తున్న వారిపై చ‌ర్య‌లు కూడా తీసుకుంటున్నాయి. ఇవ‌న్నీ గ‌మ‌నించిన ప్ర‌భుత్వం ఏ డ‌బ్బు కోస‌మైతే ఓవ‌ర్ టైం డ్యూటీలు చేస్తున్నారో అదే డ‌బ్బులు ఇచ్చి వారిని ప్రోత్స‌హిద్దామని డిసైడ్ అయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here