మహేష్‌తో మరోసారి జతకట్టనున్న అందాల తార.?

‘ఛలో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన రష్మిక మందన్న తొలి సినిమాతోనే నటిగా మంచి పేరు సంపాదించుకుంది. అనంతరం పలు విజయవంతమైన చిత్రాల్లో నటిస్తూ తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ  సుస్థిర స్థానాన్ని సంపాదించుకునే క్రమంలో దూసుకెళుతోందీ బ్యూటీ. మహేష్ బాబుతో ‘సరి లేరు నీకెవ్వరు’, అల్లు అర్జున్ తో ‘పుష్ప’లో నటించే అవకాశం కొట్టేసిన ఈ చిన్నది ప్రస్తుతం నిర్మాతల ఫెవరేట్ ఆప్షన్ గా మారుతోంది.

ఇదిలా ఉంటే రష్మిక మరోసారి ప్రిన్స్ మహేష్ తో జత కట్టనుందని సమాచారం. మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రష్మికను హీరోయిన్ గా తీసుకోవడానికి దర్శక, నిర్మాతలు ఆసక్తితో ఉన్నట్లు సమాచారం. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాతో పాటు రష్మిక  తమిళ హీరో సూర్య నటించే చిత్రంలో కూడా స్థానాన్ని సంపాదించుకున్నట్లు సమాచారం. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయవంతమైతే ఇక రష్మిక అగ్ర కథానాయికల్లో ఒకరిగా పేరు సంపాదించుకోవడం ఖాయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here