బీచ్‌లో దుస్తులు లేకుండా తిరిగిన వ్య‌క్తి ఇప్పుడు ట్రాన్స్‌జెండ‌ర్ అయ్యాడు..

ఇటీవ‌ల కాలంలో బీచ్‌లో బ‌ట్ట‌లు వేసుకోకుండా తిరిగిన సీన్ అంద‌రూ గుర్తుపెట్టుకొనే ఉంటారు. త‌న బ‌ర్త్‌డే రోజు స్పెష‌ల్ గా ఉండాల‌ని బీచ్‌లో దుస్తులు వేసుకోకుండా ర‌న్నింగ్ చేశాడు ఆ వ్య‌క్తి. ఇప్పుడు మ‌రో కొత్త స్టైల్‌లో ఉన్నాడు. ఇప్పుడు ఈయ‌న గురించే ఇండ‌స్ట్రీ మొత్తం మాట్లాడుకుంటూ ఉంది.

ఆయ‌న‌నెవ‌రో కాదు మిలింద్ సోమ‌న్‌. రీసెంట్‌గా జరిగిన బర్త్‌ డే రోజున గోవా బీచ్‌లో బట్టలు లేకుండా ఫొటోలు దిగి.. వార్తల్లో నిలిచిన సినీ సెలబ్రిటీ మిలింద్‌ సోమన్‌ తర్వాత పోలీస్‌ స్టేషన్‌ వైపు అడుగులేయాల్సి వచ్చింది. ఇప్పుడు మరో ఆసక్తికరమైన ఫొటోను తన ఇన్ స్టాలో షేర్‌ చేసి.. టాక్‌ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాడు మిలింద్‌ సోమన్‌. ఇంతకీ మిలింద్‌ పోస్ట్‌ చేసిన ఫొటో ఎవరిదో తెలుసా? ఆయనదే. ఈసారి ట్రాన్స్‌జెండర్‌ లుక్‌తో ఉన్న ఫొటోను మిలింద్‌ షేర్‌ చేశారు. ‘పౌరాష్‌పుర్‌’ అనే వెబ్ షోలో తాను ట్రాన్స్‌ జెండర్‌ పాత్రను పోషిస్తున్నట్లు మిలింద్‌ సోమన్‌ తెలిపారు. ‘థర్డ్‌ జెండర్‌ చాలా శక్తి వంతులు. ఈ లోకంతో వారు పోరాడుతారు. ఎన్నడూ చేయని అలాంటి పాత్రను చేయడాన్ని ఛాలెంజింగ్‌గా భావిస్తున్నాను’ అని మిలింద్‌ ఫోటోతో పాటు మెసేజ్‌ను కూడా షేర్‌ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here