అలాంటి వ్య‌క్తిని పెళ్లి చేసుకుంటాన‌ని చెప్పిన హీరోయిన్ ర‌కుల్ ప్రీత్‌సింగ్‌..

టాలీవుడ్‌లో మంచి ఫామ్‌లో ఉన్నారు ప్ర‌ముఖ హీరోయిన్ ర‌కుల్ ప్రీత్‌సింగ్‌. ప్ర‌స్తుతం ఆమె టాలీవుడ్‌, బాలీవుడ్ చిత్రాల్లో న‌టిస్తున్నారు. క్రిష్ డైరెక్ష‌న్‌లో ఓ సినిమా చేస్తున్నారు. అలాగే బాలీవుడ్‌లో అర్జున్ క‌పూర్‌తో క‌లిసి ఓ సినిమాలో న‌టిస్తున్నారు. అయితే అర్జున్‌కు క‌రోనా రావ‌డంతో సినిమా షూటింగ్ వాయిదా ప‌డింది.

హీరోలు, హీరోయిన్ల ప‌ర్స‌న‌ల్ లైఫ్ గురించి అంద‌రికీ ఇంట్ర‌స్ట్ ఉంటుంది. అయితే ర‌కుల్ కూడా త‌న లైఫ్ ఎలా ఉండాలో.. ఎలాంటి వ్య‌క్తిని పెళ్లి చేసుకోవాలో చెప్పింది. తన తండ్రి ఉద్యోగం రిత్యా ఆర్మీకి సంబంధించిన వాతావ‌ర‌ణంలో పెరిగాన‌ని చెప్పారు ర‌కుల్‌. అందుకే త‌న‌కు కాబోయే భ‌ర్త ఆరోగ్య‌క‌ర‌మైన లైఫ్‌స్టైల్ ఫాలో అయితే హ్యాపీ అని చెబుతోంది. వ‌రుడికి లైఫ్ గురించి క్లారిటీ ఉండాల‌ని కోరుకుంటోంది. అయితే ప్రేమ పెళ్లి గురించి న‌మ్మ‌కం ఉందని చెప్పింది ఈ ముద్దుగుమ్మ‌. మ‌రి ఎవ‌రినైనా ల‌వ్ చేసిందో లేదో అన్న విష‌యంపై ర‌కుల్ క్లారిటీ ఇవ్వ‌లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here