ప్ర‌జ‌ల‌కు నెల రోజుల్లో క‌రోనా వ్యాక్సిన్ అందజేస్తామ‌న్న యోగి ఆదిత్యానాథ్‌..

క‌రోనా వ్యాక్సిన్ కోసం ప్ర‌పంచం మొత్తం ఎదురుచూస్తోంది. ఇక ప్ర‌త్యేకంగా అత్య‌ధిక జ‌నాభా క‌లిగిన భార‌త్ కూడా వ్యాక్సిన్ వ‌చ్చిన వెంట‌నే ప్ర‌జ‌ల‌కు అందించాల‌ని యోచిస్తోంది. ఇందుకోసం అన్ని విధాలా ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఇదే స‌మ‌యంలో నెల రోజుల్లోనే ప్ర‌జ‌ల‌కు క‌రోనా వ్యాక్సిన్ అంద‌జేయ‌బోతున్న‌ట్లు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్యానాథ్ వ్యాఖ్య‌లు చేశారు.

యూపీ సీఎం కామెంట్ల‌తో ఇప్పుడు అంద‌రూ క‌రోనా వ్యాక్సిన్ ఎప్పుడు వ‌స్తుందా అన్న టెన్ష‌న్‌లో ఉన్నారు. కొవిడ్ -19 కు వ్యాక్సిన్ కేవలం ఒక నెల రోజుల్లో అందుబాటులోకి వస్తుందని యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. మేం కొవిడ్ -19 వ్యాక్సిన్‌కు ఒక నెల దూరంలో ఉన్నామ‌న్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే మహమ్మారి ఉంది… అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశంలో కొవిడ్ -19 మరణాల రేటు సుమారు 8 శాతం నమోదు అయింది, అయితే ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో కొవిడ్‌తో మరణాల శాతం 1.04 మాత్రమే అని ఆదిత్యనాథ్ చెప్పారు.

గోరఖ్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) లో జరిగిన ‘హెల్దీ ఈస్టర్న్ ఉత్తర ప్రదేశ్’ డ్రైవ్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రసంగించారు. కొవిడ్ మేనేజ్‌మెంట్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ తమను ప్రశంసించిందని, దీనిపై పరిశోధలు జరగాలని సీఎం కోరారు. కాగా క‌రోనా వ్యాక్సిన్ విష‌యంలో యోగి చెప్పిన మాట‌లు ఇప్పుడు అంద‌రి దృష్టినీ ఆక‌ర్షిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here