అమ్మాయిలు ఏం వేసుకోవాలో వాళ్లకు తెలుసు: కాజల్ 

బెంగళూరులోని ఓ పార్కులో స్పోర్ట్స్ బ్రా వేసుకొని వర్కౌట్లు చేస్తోన్న హీరోయిన్ సంయుక్త హెగ్డేపై కవితారెడ్డి అనే మహిళ దాడి చేసిన వార్త కొన్ని రోజుల క్రితం వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి సంయుక్త సోషల్ మీడియాలో చేసిన పోస్టుకు…  ఆమెకు పలువురు మద్దతుగా నిలుస్తున్నారు, ఈ క్రమంలో సంయుక్త చేసిన ట్వీట్‌ను కాజల్ రీట్వీట్ చేస్తూ.. ‘‘ఓరి దేవుడా సామ్! ఇలా జరిగిందంటే నమ్మలేకపోతున్నాను. కవితా రెడ్డి గారు, మీ కోపానికి గల కారణాలు ఏంటో తెలుసుకొని వాటిని పరిష్కరించుకోవాలి. మీ ఫ్రస్ట్రేషన్‌, కోపం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవాలి. వీటన్నింటినీ మించి అమ్మాయిలు ఏం వేసుకోవాలో వాళ్లకు తెలుసు. ఎదుటివారి గురించి పట్టించుకోవడం మాని మన పని మనం చూసుకుంటే మంచిది’’ అని పేర్కొన్నారు. కాగా, సంయుక్తకు కవితా రెడ్డి క్షమాపణలు చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here