పుట్టిన రోజున ఎంగేజ్ మెంట్ చేసుకున్న గుత్తా జ్వాల..

భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తాజ్వాల గత కొన్ని రోజులుగా తమిళ హీరో విష్ణు విశాల్ తో డేటింగ్ లో ఉన్న విషయం తెలిసిందే. వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలను ఈ జంట సోషల్ మీడియాలో అడపాదడపా పోస్ట్ చేస్తూనే ఉంది. అయితే తాజాగా ఈ జంట నిశ్చితార్థం తో తమ బంధాన్ని మరింత బలపరచు కున్నారు. ఈ విషయాన్ని విష్ణు ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు.

తామిరువురు రింగులు మార్చుకుంటున్న ఫోటోను పోస్ట్ చేస్తూ.. ‘హ్యాపీ బర్త్‌డే గుత్తా జ్వాల.. జీవితానికి కొత్త ఆరంభం.. సానుకూల దృక్పథంతో ఉందాం. మన భవిష్యత్తుతో పాటు ఆర్యన్‌, మన కుటుంబాలు, స్నేహితులు, మన చుట్టూ ఉన్న జనాల భవిష్యత్తు ఉత్తమంగా ఉండేందుకు కృషి చేద్దాం. కొత్త ఆరంభానికి మీ అందరి ఆశీర్వాదం, ప్రేమ మాకు కావాలి. అర్థరాత్రి ఉంగరాన్ని ఏర్పాటు చేసిన బసంత్‌జైన్‌కు ధన్యవాదాలు’ అంటూ సుదీర్ఘమైన క్యాప్షన్ జోడించాడు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here