22 కేజీల బరువు తగ్గిన ఆ హీరో కూతురు..

సినీ ఇండ‌స్ట్రీలో హీరోలకు మామూలు క్రేజ్ ఉండ‌దు. ఇక హీరోల‌తో పాటు హీరోల ఫ్యామిలీ మెంబ‌ర్స్ కూడా బాగా పాపుల‌ర్ అవుతారు. దీంతో వీళ్లు ఏం చేసినా అభిమానుల‌కు ఆస‌క్తిగా గ‌మ‌నిస్తుంటారు. ఇప్పుడు ఓ స్టార్ హీరో కూతురు స‌న్న‌బ‌డి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

మలయాళ ప్రముఖ నటుడు మోహన్‌లాల్‌ కూతురు విస్మయ భారీగా బరువు తగ్గి అభిమానులకు షాక్‌ ఇచ్చారు. ప్రస్తుతం థాయ్‌లాండ్‌లో నివసిస్తున్న ఆమె ఇప్పటి వరకు చాలా లావుగా, బొద్దుగా ఉండేవారు. ఇలా ఒక్కసారిగా సన్నబడి నెటిజన్లకు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. బరువు తగ్గడం కోసం తీవ్రంగా శ్రమించి ప్రత్యేక వ్యాయామాలు, మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకున్నారు. దీంతో ఏకంగా 22 కిలోలు బరువు తగ్గారు. ఈ క్రమంలో శుక్రవారం బరువుతో ఉన్న ఫోటోను, ఇప్పటి ఫోటోను ఆమె సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. దీంతోపాటు మార్షల్‌ ఆర్ట్స్‌ ట్రైనింగ్‌కు సంబంధించిన వీడియోను కూడా అభిమానులతో పంచుకున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు విస్మయ కష్టాన్ని గుర్తిస్తూ, ఆమెను పొగడ్తలతో ముంచెస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here