ప‌శ్చిమ‌బెంగాల్‌లో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన అమిత్ షా..

ప‌శ్చిమ‌బెంగాల్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పర్య‌టిస్తున్నారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో ఆయన కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. బెంగాల్‌లో బీజేపీ సునామీ ప్రారంభమైందని, ఆ సునామీలో సీఎం మమతా బెనర్జీ కొట్టుకుపోవడం ఖాయమని అన్నారు. ఎన్నికలు దగ్గరపడ్డ నాటికి తృణమూల్ కాంగ్రెస్‌లో ఒక్క మమతా బెనర్జీ మాత్రమే మిగులుతారని ఆయన ఎద్దేవా చేశారు.

పశ్చిమ మిడ్నాపూర్‌లో జరిగిన బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పాల్గొన్నారు. ఈ సభలోనే తృణమూల్ కీలక నేత సుబేందు అధికారి బీజేపీలో చేరారు. ఈయనతో పాటు ఓ ఎంపీ, తొమ్మిది మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడారు. సీఎం మమతా బెనర్జీ చేస్తోన్న అధికార దుర్వినియోగం, బంధుప్రీతి, అవినీతి కారణంగానే ఒక్కొక్కరు తృణమూల్ పార్టీకి రాజీనామా చేస్తున్నారని షా తీవ్రంగా ఆరోపించారు. మూడు దశాబ్దాలు పాలించమని కాంగ్రెస్‌కు అధికారం కట్టబెట్టారని, 10 ఏళ్లు కమ్యూనిస్టులకు, 5 ఏళ్లు తృణమూల్‌కు అధికారం ఇచ్చారని.. ఈ సారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని ఆయన బెంగాల్ ప్రజలను అభ్యర్థించారు. ఐదేళ్లు అవకాశమిస్తే బెంగాల్‌ను ‘‘బంగారు బెంగాల్‌’’ గా మారుస్తామని ఆయన హామీ ఇచ్చారు.

వచ్చే ఎన్నికల ఫలితాల్లో 200 సీట్లు సాధించి, బెంగాల్‌ను కైవసం చేసుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సీఎం మమతకు వ్యతిరేకంగా బెంగాల్ బెంగాలే ఏకమవుతోందని, బెంగాల్ లో నెలకొన్న సమస్యలను మోదీ చూసుకుంటారని ఆయన హామీ ఇచ్చారు. బెంగాల్ పరిస్థితులను మార్చడానికే చాలా మంది బీజేపీలో చేరుతున్నారని, దీనికి మమత ఎందుకు గాబరా పడుతుందో అర్థం కావడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. చాలా మంది నేరస్తులను మమత కాపాడుతున్నారని షా ఆరోపించారు. వరద సహాయ నిధులను కేంద్రం కేటాయిస్తే, వాటిని కూడా తృణమూల్ గూండాలు తమ జేబుల్లో వేసుకున్నారని తీవ్రంగా ధ్వజమెత్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here