క‌రోనా గురించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన హీరో రామ్‌..

క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచాన్ని ఇంకా భ‌య‌పెడుతూనే ఉంది. సామాన్యుల నుంచి సెల‌బ్రెటీల వ‌ర‌కు అంద‌రూ క‌రోనాకు భ‌య‌ప‌డాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఇక 2020 పూర్త‌వుతున్న సంద‌ర్బంలో ప్ర‌తి ఏడాది ఎన్నో జ్ఞాప‌కాలు ఉండేవి. అయితే ఈ సారి మాత్రం కేవ‌లం క‌రోనానే గుర్తుగా ఉండిపోనుంది.

ఈ ప‌రిస్థితుల్లో యంగ్ హీరో రామ్ త‌న జీవితంలో ఎదురైన అనుభ‌వాల గురించి మాట్లాడారు. కరోనా కారణంగా ఈ ఏడాది భిన్న అనుభవాలు ఎదురయ్యాయన్నారు. అందులో కొన్ని మంచివి.. మరికొన్ని చెడ్డవి అన్నారు. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఉండడం వల్ల కుటుంబంతో ఎక్కువ సమయం గడిపే అవకాశం వచ్చింది. అది సంతోషంగా అనిపించింది. అయితే ఎక్కువ రోజులు ఇంట్లోనే గడపాల్సి రావడం చికాకు కలిగించిందన్నారు. రామ్ అమ్మ‌తో పాటు సోద‌రుడికి కూడా క‌రోనా సోకింద‌ని తెలిపాడు. అయితే వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో చికిత్స తీసుకోవ‌డం వ‌ల్ల క‌రోనాను జ‌యించార‌న్నారు. క‌రోనా కార‌ణంగా రామ్ సోద‌రుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న‌ట్లు తెలిపారు. ఓ ఇంట‌ర్వూలో పాల్గొన్న సంద‌ర్బంగా రామ్ ఈ వ్యాఖ్య‌లు చేశాడు. క‌రోనాతో చాలా మంది హీరోలు, హీరోయిన్లు, డైరెక్ట‌ర్లు, ప్రొడ్యూస‌ర్లు తీవ్ర ఇబ్బందులు ప‌డిన విష‌యం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here