క‌రోనా వ్యాక్సిన్ తీసుకుంటే పురుషులు స్త్రీల గొంతుతో మాట్లాడ‌తారా.. ఎందుకీ అనుమానాలు..

క‌రోనా వ్యాక్సిన్‌పై ప్ర‌పంచ వ్యాప్తంగా పలు అనుమానాలు ఉన్న మాట వాస్త‌వ‌మే. ఎందుకంటే వ్యాక్సిన్ వ‌ల్ల కొంద‌రిలో దుష్ప్ర‌లితాలు క‌నిపిస్తున్నాయ‌ని ఇదివ‌ర‌కే తెలిసింది. అయితే కొంద‌రు మాత్రం క‌రోనాను, క‌రోనా వ్యాక్సిన్‌ను త‌క్కువ‌గా అంచ‌నా వేస్తున్నారు. ఈ జాబితాలో ప‌లు దేశాల అధ్య‌క్షులు సైతం ఉన్నారు.

కరోనా సంక్షోభం ఉందన్న విషయాన్ని గుర్తించేందుకు నిరాకరిస్తున్న బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బోల్సోనారో తాజాగా కరోనా వ్యాక్సిన్లపై కూడా తన దాడి ప్రారంభించారు. అక్కడ టీకా పంపిణీ కొనసాగుతున్న తరుణంలోనే ఆయన.. ‘కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే మొసళ్లైపోవచ్చు’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీకా తీసుకున్న వారిలో వచ్చే అనారోగ్య సమస్యలకు తాము బాధ్యత వహించమంటూ బ్రెజిల్‌తో ఫార్మా కంపెనీ ఫైజర్ చేసుకున్న ఒప్పందం ఆధారంగా ఆయన కరోనా టీకాలపై పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఫైజర్‌తో కుదిరిన ఒప్పందంలో అంతా క్లియర్‌గానే ఉంది. ‘సైడ్ ఎఫెక్ట్ వస్తే మేం బాధ్యత తీసుకోం’ అని వారు చెప్పారన్నారు. కాబట్టి మీరు మొసళ్లుగా మారిపోతే అందుకు మీరే బాధ్యులన్నారు. అలా కాకుండా..మీకు అంతీంద్రియ శక్తులు వచ్చినా లేక..మహిళల్లో గడ్డాలు మొలిచినా, పురుషులు స్త్రీల గొంతుతో మాట్లాడినా కంపెనీ వారికేం సంబంధం ఉండదని ప్రజల్లో భయాందోళనలు కలిగే రీతిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతకుమనుపు..టీకా కార్యక్రమంలో ప్రారంభించే సమయంలోనూ తాను టీకా తీసుకోనని బోల్సోనారో స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here