రియ‌ల్ హీరోగా మారిన కానిస్టేబుల్‌..

ట్రాఫిక్ కానిస్టేబుళ్లు స‌క్ర‌మంగా విధులు నిర్వ‌ర్తిస్తూ అంద‌రి నుంచి ప్ర‌శంస‌లు అందుకుంటున్నారు. మొన్న హైద‌రాబాద్‌లో ఓ అంబులెన్స్ వెళుతుంటే దాని ముందు ఓ పోలీస్ ప‌రుగెత్తుతూ ఉన్న వీడియో మ‌నం చూశాం. అంబులెన్సులో ఉన్న పేషెంట్ ను తొంద‌ర‌గా హాస్పిటల్‌కి పంపేందుకు పోలీస్ ట్రాఫిక్‌ను క్లియ‌ర్ చేసుకుంటూ అలాగే ర‌న్నింగ్ చేశాడు.

ఆ త‌ర్వాత నాలుగు రోజల‌కు ఆ అంబులెన్సులో ఉన్న పేషెంట్ హాస్పిట‌ల్ నుంచి డిశ్చార్జి కూడా అయ్యారు. దీంతో ఆ పోలీస్ హీరో అయిపోయాడు. ఆ వీడియో సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా వైర‌ల్ అయ్యింది. దీంతో ఉన్న‌తాధికారుల నుంచి సామాన్యుల వ‌ర‌కు అంద‌రూ శ‌భాష్ పోలీస్ అన్నారు. మీడియాలో ఆయ‌న బాగా పాపుల‌ర్ అయ్యాడు. ఇప్పుడు స‌రిగ్గా అలాంటి ఘ‌ట‌నే ఇంకోటి చోటుచేసుకుంది.

తమిళనాడులో భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా సక్రమంగా విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌పై నెటిజనులు అభినందనల కురిపిస్తున్నారు. తూత్తుకుడికి చెందిన ట్రాఫిక్ కానిస్టేబుల్ ముత్తురాజా రెయిన్‌ కోటుధరించి మరీ విధి నిర్వహణలో తన నిబద్ధతను చాటుకున్నారు. దీనిని గమనించిన ఐపీఎస్ అధికారి దీపాన్షు కబ్రా సోషల్‌ మీడియాలో ఆ కానిస్టేబుల్‌కు సంబంధించిన వీడియో షేర్ చేశారు.

13 సెకన్ల పాటు వున్న ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. హోరు వానలో అత్యంత బిజీగా ఉన్న రోడ్డులో అంకితభావంతో విధులను నిర్వర్తిస్తున్న ముత్తురాజాను ఉన్నతాధికారులు ప్రశంసలతో ముంచెత్తారు. అలాగే ఎస్‌పీ జయకుమార్ కానిస్టేబుల్ ముత్తురాజాను అభినందించడంతోపాటు, అతనికి బహుమతి కూడా ప్రకటించారు. కాగా సోషల్ మీడియాలో ముత్తురాజాను రియల్‌ హీరో అంటూ అభినందిస్తున్నారు. అంద‌రూ శ‌భాష్ పోలీస్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here