ట్విట్ట‌ర్‌లో చాటింగ్ చేసిన సూర్య‌, మ‌హేష్ బాబు..

హీరో మ‌హేష్ బాబు, సూర్య ఇద్ద‌రూ ఇండ‌స్ట్రీలో మొద‌టి నుంచి మంచి మిత్రులుగా ఉన్నారు. సూర్య త‌మ్ముడు కార్తీ.. మ‌హేష్ క్లాస్‌మేట్ కూడా. అయితే ఇది అప్ప‌ట్లో విష‌యం అనుకోండి. అయితే ఇప్పుడు తాజాగా మ‌హేష్ బాబు, సూర్య ఇద్ద‌రూ చాటింగ్ చేసుకున్నారు.

ఇటీవ‌ల సూర్య న‌టించిన ఆకాశం నీ హ‌ద్దురా సినిమా ఓటీటీలో రిలీజ్ అయిన విష‌యం తెలిసిందే. విడుద‌ల అయిన‌ప్ప‌టి నుంచి నేటి వ‌ర‌కు ఈ సినిమా అంద‌రి నుంచి మంచి ప్ర‌శంస‌లు అందుకుంటూనే ఉంది. సుధా కొంగర దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఎయిర్‌ డెక్కన్‌ అధినేత జీఆర్‌ గోపీనాథ్‌పై రాసిన పుస్తకం సింప్లీ ఫ్లై పుస్తకం ఆధారంగా తెర‌కెక్కింది. అన్ని వ‌ర్గాల నుంచి మంచి టాక్‌ను సినిమా అందుకుంది. రీసెంట్‌గా సినిమా చూసిన మ‌హేష్ ట్విట్టర్‌ వేదిక చిత్ర యూనిట్‌ను అభినందించారు.
మ‌హేష్ ఏమ‌న్నారంటే.. “శూరరై పోట్రు(ఆకాశం నీ హద్దురా) స్ఫూర్తిదాయకమైన చిత్రమ‌న్నారు. బ్రిలియంట్‌ డైరెక్షన్‌, అద్భుతమైన పెర్ఫామెన్స్‌, సూర్య టాప్‌ రేంజ్‌లో నటించాడని పేర్కొన్నాడు. మూవీ టీం మొత్తానికి అభినంద‌న‌లు తెలిపారు. దీనికి హీరో సూర్య ట్విట్టర్‌ వేదికగా తన స్పందనను తెలియజేశారు. మా సినిమాపై ప్రశంసలు కురిపించిన మహేశ్‌కు ధన్యవాదాలు. సర్కారువారిపాట సినిమా కోసం ఎదురుచూస్తున్నామ‌ని చెప్పారు. ఇలా ఇద్ద‌రు హీరోలు ఒక‌రి సినిమా గురించి మ‌రొక‌రు మాట్లాడుకుంటుండ‌టంతో అభిమానులు కూడా సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here