కాంగ్రెస్ సీనియ‌ర్ నేత ప‌రిస్థితి విష‌మం.. కార‌ణం కరోనా..

క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌ముఖుల‌ను చాలా ఇబ్బంది పెడుతోంది. ఇందుకు కార‌ణం క‌రోనా కేసులు ఎక్కువ‌గా ఉన్నా ప్ర‌జ‌ల్లో తిరుగుతూ ఉండ‌టం ఒక‌టైతే.. ప్ర‌జా ప్ర‌తినిధుల వ‌య‌స్సు కూడా కార‌ణం. ఎందుకంటే ప్ర‌జ‌ల్లో తిరుగుతున్న నేత‌లు క‌రోనా బారిన ప‌డుతూ తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. తాజాగా కాంగ్రెస్ సీనియ‌ర్ నేత అహ్మ‌ద్ ప‌టేల్ క‌రోనా బారిన ప‌డిన విష‌యం తెలిసిందే.

కాంగ్రెస్ సీనియర్ నేత, పార్టీ కోశాధికారి అహ్మద్ పటేల్ (71) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆయ‌న‌కు అక్టోబ‌ర్ 1వ తేదీన క‌రోనా నిర్ద‌ర‌ణ అయ్యింది. అయితే ఆ త‌ర్వాత ఆయ‌న‌కు ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు ఇబ్బంది తెచ్చి పెట్టాయి. దీంతో గురుగావ్‌లోని మేదాంత ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స పొందుతున్నారు. ఇన్‌ఫెక్షన్ కారణంగా ఆయన ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయని, ఇతర కీలక అవయవాలపై కూడా ఆ ప్రభావం పడిందని అంటున్నారు.

కాంగ్రెస్ పార్టీలో ఈయ‌న‌ది కీ రోల్ అని చెప్పొచ్చు. సోనియా గాంధీకి అత్యంత న‌మ్మ‌క‌స్తుల్లో అహ్మ‌ద్ ప‌టేల్ ఒక‌రు. ఈయ‌న ఆరోగ్యంపై కుమారుడు స్పందించారు. ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉంద‌ని చెప్పారు. అయిన‌ప్ప‌టికీ పార్టీ నేతలు తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ప‌టేల్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కోరుతున్నారు. కాగా ఇటీవ‌ల దేశంలో ప‌లువ‌రు ప్ర‌జా ప్ర‌తినిధులు క‌రోనా బారిన ప‌డి కోలుకునేందుకు తీవ్రంగా ఇబ్బంది ప‌డిన విష‌యం తెలిసిందే. దుర‌దృష్ట‌వ‌శాత్తు ప‌లువురు ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రాణాలు కూడా విడిచారు. ప్ర‌స్తుతం ఈ కాంగ్రెస్ నేత ఆరోగ్యంగా కోలుకోవాల‌ని శ్రేణులు కోరుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here