73 కోట్ల రూపాయ‌లకు అమ్ముడుపోయిన పుస్త‌కం..

ప్ర‌ముఖులు రాసిన పుస్త‌కాలకు మంచి గిరాకీ ఉంటుంది. ఆ పుస్త‌కం త‌మ వ‌ద్ద ఉంటే చాల‌నుకునే వారు చాలా మందే ఉంటారు. ఇప్పుడు ప్ర‌ముఖ ర‌చ‌యిత‌, నాట‌క‌క‌క‌ర్త షేక్‌స్పియ‌ర్ రాసిన పుస్త‌కం రికార్డు సృష్టించింది. ఏకంగా 73 కోట్ల రూపాయ‌ల‌కు అమ్ముడుపోయింది.

షేక్‌స్పియర్ రాసిన మొదటి నాటక సంకలనం ఫస్ట్ ఫోలియో 36 నాట‌కాల‌తో రాసిన ఈ పుస్త‌కాన్ని 1623లో ప్రింట్ చేయించారు. అప్ప‌ట్లో ఈ పుస్త‌కాన్ని ముద్రించేందుకు జాన్ హెమింగే, హెన్నీ కోండెల్ అనే ఇద్ద‌రు స్నేహితులు స‌హ‌క‌రించార‌ని షేక్‌స్పియ‌ర్ త‌న పుస్త‌కంలో రాశారు. ఇంగ్లీష్ మాస్ట‌ర్ ప‌బ్లికేష‌న్ ద్వారా ఇది మార్కెట్లోకి అప్ప‌ట్లో విడుద‌లైంది. ఇప్పుడు ఆ పుస్త‌కాన్ని వేలం వేశారు. అయితే వేలంలో 4 నుంచి 6 మిలియ‌న్ డాల‌ర్లు ప‌లుకుతుంద‌ని వారు అనుకున్నారు.

అయితే వారి అంచ‌నాలు తారుమారు చేస్తే రెట్టింపు ధ‌ర 9.97 మిలియ‌న్ల‌కు ఇది అమ్ముడుపోయింది. మన రూపాయ‌ల్లో చెప్పుకుంటే రూ. 73 కోట్ల‌కు ఇది అమ్ముడుపోయింది. న్యూయార్క్‌లోని క్రిస్టీ వేలంలో దీన్ని వేలం వేశారు. ఈ పుస్త‌కాన్ని ఇంగ్లీషులో గొప్ప సాహిత్యంగా చెబుతుంటారు. అందుకే ఇది ఇంత ధ‌ర ప‌లికిన‌ట్లు తెలుస్తోంది. అయితే గ‌తంలో బిల్ గేట్స్ కూడా కో డెక్స్ లియోసెస్ట‌ర్ ఆప్ లియానార్డో డే విన్సి అనే పుస్త‌కాన్ని రాశారు. ఇది రికార్డు స్థాయిలో అంటే 30.8 మిలియ‌న్ డాల‌ర్ల‌కు అమ్ముడుపోయింది. అంటే 220 కోట్ల‌న‌మాట‌. 1994లో ఇది వేలం వేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here