విజ‌య‌వాడ‌లో దారుణం.. ప్రేమించ‌లేద‌ని యువ‌తిపై దాడి చేసిన వ్య‌క్తి..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని విజ‌య‌వాడ‌లో దారుణం చోటుచేసుకుంది. ప్రేమించ‌డం లేద‌ని ఓ యువ‌తిపై దాడి చేశాడో ఉన్మాది. చికిత్స పొందుతూ యువ‌తి చ‌నిపోయింది. ఈ ఘ‌ట‌న క్రీస్తురాజుపురంలో జ‌రిగింది.

ఇంజినీరింగ్ చ‌దువుతున్న యువ‌తిపై స్వామి అనే యువ‌కుడు దాడి చేశాడు. యువ‌తి ఇంటికి వెళ్లి క‌త్తితో ఆమెపై దాడి చేశాడు. గొంతు కోసి ఆ త‌ర్వాత అత‌ను కూడా గాయ‌ప‌ర్చుకున్నారు. విష‌యం తెలుసుకున్న స్థానికులు వెంట‌నే పోలీసులకు స‌మాచారం అందించారు. వీరిద్ద‌రిని గుంటూరు ప్ర‌భుత్వాసుప‌త్రికి త‌ర‌లించారు. యువ‌తి చికిత్స పొందుతూ చ‌నిపోయింది. మాచ‌ర్ల పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది.

అయితే బీటెక్ చ‌దువుతున్న ఆ యువ‌తిని గ‌త కొంత కాలంగా ప్రేమిస్తున్నానంటూ స్వామి వెంట‌ప‌డేవాడ‌ని తెలుస్తోంది. అయితే ఆమె నిరాక‌రించ‌డంతో వేధింపుల‌కు గురి చేశాడ‌ని స‌మాచారం. ఇప్పుడు ఏకంగా బ‌రితెగించి యువ‌తిపై దాడికి పాల్ప‌డ్డాడు. యువ‌తి మృతి చెందిన‌ విష‌యం తెలుసుకున్న స్థానికులు, యువ‌తి స్నేహితులు తీవ్ర విచారం వ్య‌క్తం చేస్తున్నారు. పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్నారు. కాగా ప్రేమోన్మాదులు రెచ్చిపోవ‌డం ఇప్పుడేమీ కొత్త కాదు గ‌తంలో కూడా ఇలాంటి సంఘ‌ట‌న‌లు వెలుగు చూశాయి. క్రీస్తురాజుపురంలో ఇప్పుడు విషాధ‌ఛాయ‌లు అలుముకున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here