కుక్క‌తో ఆడుకుంటూ కింద ప‌డిపోయిన అమెరికా అధ్య‌క్షుడు..

అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. జో బైడెన్ కుక్క‌తో ఆడుకుంటూ కింద ప‌డిపోయాడు. ఈ విష‌యం వెలుగులోకి రావ‌డంతో అమెరికా ప్ర‌జ‌ల‌తో పాటు ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ఆయ‌న అభిమానులు ఆందోళ‌న‌లో ప‌డ్డారు.

జో బైడెన్ తన పెంపుడు కుక్కతో ఆడుకుంటూ జారి పడి గాయపడిన ఘటన తాజాగా వెలుగుచూసింది. జో బైడెన్ పెంచుకుంటున్న జర్మన్ షెపర్డ్ జాగిలంతో ఆడుకుంటుండగా జారి పడటంతో చీలమండకు గాయమైంది. దీంతో బైడెన్ డెలావేర్ లోని ఆర్థోపెడిక్ డాక్టరును కలిసి చికిత్స తీసుకున్నారని బైడెన్ కార్యాలయం వెల్లడించింది. శ‌నివారం ఇది జ‌రిగింది. ఆదివారం ఆయ‌న హాస్పిట‌ల్‌లో చికిత్స తీసుకున్నారు. జో బైడెన్రెండు కుక్కలను పెంచుకుంటున్నారు. అందులో 2018లో దత్తత తీసుకున్న మేజర్తో అనే కుక్కతో ఆడుకుంటుండగా జారి పడి గాయపడ్డారు.

బైడెన్ 2008లో ఒక కుక్కను దత్తత తీసుకున్నారు. బైడెన్ తో పాటు తన రెండు పెంపుడు కుక్కలు కూడా వైట్ హౌస్ కు రానున్నాయి. కాగా ఉత్కంఠ‌గా సాగిన అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో జో బైడెన్ విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. అద్య‌క్షుడు ట్రంప్ ఈ విష‌యంలో కోర్టుల‌కు సైతం వెళ్లారు. అయిన‌ప్ప‌టికీ జ‌న‌వ‌రి నెల‌లో బైడెన్ అధ్య‌క్షుడిగా బాద్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు. ఇలాంటి స‌మ‌యంలో ఆయ‌న‌కు ప్ర‌మాదం జ‌ర‌గ‌డం ఆయ‌న అభిమానుల‌ను క‌ల‌వ‌ర‌పెడుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here