ఐదు సంవ‌త్స‌రాల్లో 12 సంవ‌త్స‌రాలు పెరిగిన ఆ నాయ‌కుడి వ‌యస్సు..

ఆ రాజ‌కీయ నాయ‌కుడి వ‌య‌స్సు అమాంతం పెరిగిపోయింది. ఎంత‌లా అంటే ఎన్నిక‌ల సంద‌ర్బంగా చూపించిన అఫిడ‌విట్ల‌లో మూడు ఎన్నికల్లో మూడు ర‌కాల వ‌య‌స్సులు ఉన్నాయి. దీంతో ఇప్పుడు ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఆయ‌నెవ‌రో కాదు బీహార్ డిప్యూటీ సీఎం. బీహార్‌లో ఎన్నిక‌లు ముగిసినా ఇంకా రాజ‌కీయ నాయ‌కుల మ‌ధ్య మాట‌ల యుద్ధం న‌డుస్తూనే ఉంది.

బీహార్ డిప్యూటీ సీఎం తార్ కిషోర్ వ‌య‌స్సు ఇప్పుడు వివాదాస్ప‌దం అవుతోంది. ఐదు సంవత్సరాల్లో తార్‌కిషోర్ ప్రసాద్ వయసు రెండింతలయ్యింది. ఇది వినడానికి వింతగా అనిపించినప్పటికీ ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అతను దాఖలు చేసిన అఫిడవిట్ పరిశీలిస్తే ఇది నిజమని నమ్మాల్సివస్తుంది. తార్‌కిషోర్ ప్రసాద్… కటిహార్ ఎమ్మెల్యే. ఆయన తొలిసారిగా ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2010లో ఆయన దాఖలు చేసిన అఫిడవిట్‌లో తన వయసు 49 ఏళ్లుగా పేర్కొన్నారు. 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తన వయసును మూడేళ్లు పెంచి 52గా చూపించారు.

ఇప్పుడు ఐదేళ్ల తరువాత మొన్న జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తార్‌కిషోర్ ప్రసాద్ తన వయసును అఫిడవిట్‌లో 64 ఏళ్లుగా పేర్కొన్నారు. ఈ విధంగా చూస్తే 2015 నుంచి 2020 మధ్య తార్‌కిషోర్ ప్రసాద్ వయసు 12 ఏళ్లు పెరిగినట్లయ్యింది. కాగా ఈ విషయమై స్పందించిన తార్‌కిషోర్ ప్రసాద్… తన వయసు వియసు విషయంలో రాద్దాంతం చేస్తున్నారని, తాను 1956 జనవరి 5న జన్మించానని తెలిపారు. 2015లో తాను ఎన్నికల అఫిడవిట్ లో తన వయసు 59 అని రాశానని, దానిని 52 అని చెబుతున్నారని ఆరోపించారు. మెన్నటి ఎన్నికల్లో తన వయసు 64గా పేర్కొన్నానని తార్‌కిషోర్ ప్రసాద్ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here