అందుకే సీఎం జ‌గ‌న్‌మోహన్‌రెడ్డికి ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌జ‌ల మ‌నిషి అంటారు. ఎందుకంటే ఆయ‌న‌కు ప్ర‌జ‌ల కష్టాలు తెలుసుకాబ‌ట్టి అందుకు అనుగుణంగానే ఏ నిర్ణ‌య‌మైనా తీసుకుంటారని చెబుతారు. తాజాగా తీసుకున్న ఈ నిర్ణ‌యంతో మ‌రోసారి జ‌గ‌న్ ప్ర‌జ‌ల్లో మార్కులు కొట్టేశారు. మ‌న‌సున్న ముఖ్య‌మంత్రిగా పిలిపించుకుంటున్నారు.

వివిధ సంక్షేమ ప‌థ‌కాల‌తో ముందుకెళ్తున్న జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఇప్పుడు ఉద్యోగుల బాగోగుల‌పై ప‌డింది. గ్రామ‌, వార్డు స‌చివాల‌య ఉద్యోగుల‌కు ప్ర‌సూతి సెల‌వులు ఇస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు ఉత్త‌ర్వులు వెలువ‌డ్డాయి. మామూలుగా అయితే ప్రభుత్వ ఉద్యోగినిలు ప్ర‌సూతి సెల‌వులు తీసుకుంటారు. అయితే ప్ర‌భుత్వం కొత్త‌గా ప్రారంభించిన గ్రామ వార్డు స‌చివాల‌యాల్లో ప‌నిచేస్తున్న ఉద్యోగినులు కూడా ప్ర‌సూతి సెల‌వులు కావాల‌ని కోరారు.

అయితే స‌చివాలయ ఉద్యోగులు రెండేళ్ల ప్రొబేష‌న్‌ కాలం కింద విధులు నిర్వ‌ర్తిస్తున్నారు. ఆ త‌ర్వాత వీరిని ప్రభుత్వం సాదార‌ణ ఉద్యోగుల త‌ర‌హాలో జీత భ‌త్యాలు, సెల‌వులు ఉంటాయి. అయితే ఇప్పుడు స‌చివాల‌య ఉద్యోగినులు మాత్రం త‌మ‌కు మెట‌ర్నిటీ లీవ్స్ కావాల‌ని ప్ర‌భుత్వాన్ని కోరారు. దీనిపై స్పందించిన జ‌గ‌న్ ప్ర‌భుత్వం స‌చివాల‌య ఉద్యోగినుల‌కు కూడా సాదార‌ణ ఉద్యోగుల మాదిరిగానే 180 రోజుల ప్ర‌సూతి సెల‌వులు మంజూరు చేస్తూ నిర్ణ‌యం తీసుకొని ఉత్త‌ర్వులు ఇచ్చింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ‌, వార్డు స‌చివాల‌య ఉద్యోగులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here