తెలుగు ‘లస్ట్ స్టోరీస్’ లో శృతిహాసన్..!

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్…  హిందీలో లస్ట్ స్టోరీస్ పేరుతో ఓ వెబ్ సిరీస్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. నలుగురు వేరువేరు దర్శకులు, నలుగురు మహిళల జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన ఈ సిరీస్ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. నిజానికి నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ వెబ్ సిరీస్ తో బాగా పాపులర్ అయింది. దీంతో తాజాగా ఈ సంస్థ లస్ట్ స్టోరీస్ ను తెలుగులో తెరకెక్కించాలని నిర్ణయించుకుంది.

ఈ క్రమంలోనే దర్శకులు నందినిరెడ్డి, తరుణ్ భాస్కర్, సంకల్ప్ రెడ్డి ఒక్కో స్టోరీని డైరెక్ట్ చేశారు. ఇక మరో స్టోరీని మహానటి ఫేమ్ నాగ అశ్విన్ తెరకెక్కించనున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ స్టోరీలో శ్రుతిహాసన్ కథానాయికగా నటించనున్నట్లు తెలుస్తోంది. 30 నిమిషాల నిడివిగల ఈ సిరీస్ లో శృతి హాసన్ పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుందని సమాచారం. ఇప్పటికే కథ పూర్తి చేసుకున్న నాగ్ అశ్విన్ షూటింగ్ కూడా ప్రారంభించాడు. చిత్రీకరణలో భాగంగా హైదరాబాద్.. అమీర్ పేటలోని సారథి స్టూడియోలో ఓ ప్రత్యేక సెట్ వేశారు. ఈ షూటింగ్ పూర్తి కాగానే వెబ్ సిరీస్ ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ వెబ్ సిరీస్ కు ‘X లైఫ్’ అనే పేరును ఫైనల్ చేయనున్నట్లు సమాచారం. మరి ఈ బోల్డ్ కంటెంట్ లో మన తెలుగు ముద్దుగుమ్మలు ఎలా ఆకట్టుకుంటారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here