అనుష్క‌శ‌ర్మ గావ‌స్క‌ర్ మ‌ధ్య ముదురుతున్న వివాదం..

టీం ఇండియా మాజీ క్రికెట‌ర్ సునీల్ గావ‌స్క‌ర్‌, విరాట్ కొహ్లీ భార్య అనుష్య శ‌ర్మ‌ల మ‌ధ్య వివాదం ముదురుతోంది. గావ‌స్క‌ర్ వ్యాఖ్య‌ల‌పై అనుష్క శ‌ర్మ మండిప‌డ‌గా అందుకు స‌మాధానం కూడా ఆయ‌న ఇచ్చారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఇది చ‌ర్చ‌కు దారితీస్తోంది.

బెంగుళూరు, పంజాబ్ మ్యాచ్‌లో కొహ్లి స‌రిగ్గా ఆడ‌లేదు. దీంతో గావాస్క‌ర్ దీనిపై స్పందిస్తూ లాక్‌డౌన్‌లో అనుష్క బౌలింగ్‌లో మాత్ర‌మే కొహ్లీ ప్రాక్టీస్ చేశాడని.. అలా చేయ‌డం ఆయ‌న‌కు ఉప‌యోగ‌ప‌డ‌లేద‌ని అన్నాడు.  ఈ వీడియో ఇప్పుడు హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. అయితే లాక్‌డౌన్లో ఇంటి మిద్దె మీద అనుష్క విసిరిన బంతుల్ని కోహ్లీ ఆడుతుండ‌గా ఎవ‌రో తీసిన వీడియో వైరల్ అయ్యింది. ఈ వీడియోను బ‌ట్టి గావస్క‌ర్ అన్నాడు.

అయితే దీనిపై అనుష్క వ‌ర్మ ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే. త‌న‌ను క్రికెట్ విష‌య‌ల్లోకి లాగ‌డం ఎప్పుడు మానుకుంటార‌న్నారు. కాగా అనుష్క‌శ‌ర్మ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన గావ‌స్క‌ర్ తాను ఏ సంద‌ర్బంలో అలా అన్నానో వివ‌ర‌ణ ఇచ్చారు. ఆమెను తాను నిందించ‌లేదేన్నారు. దీంతో ఇరువురి మ‌ధ్య వివాదం కాస్త పెద్ద‌దిగా మారుతోంది. ఇటు కోహ్లీ, అనుష్క ఫ్యాన్స్ గావ‌స్క‌ర్‌పై మండిప‌డుతున్నారు. దీనికి ధీటుగా గావ‌స్క‌ర్‌కు కూడా మ‌ద్ద‌తుగా ప‌లువురు కామెంట్లు చేస్తున్నారు. మ‌రి ఈ వివాదం ఎంత‌వ‌ర‌కు వెళ్తుందో అన్న ఆందోళ‌న క్రికెట్ అభిమానుల్లో నెల‌కొంది. త్వ‌ర‌లోనే దీనికి ఫులిస్టాప ప‌డాల‌ని కోరుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here