వ్య‌భిచారంపై బాంబే హైకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

బాంబే హైకోర్టు సంచ‌ల‌న తీర్పు ఇచ్చింది. ఇందులో మ‌హిళ‌ల‌కు త‌మ‌కు నచ్చిన వృత్తిని ఎంచుకునే హ‌క్తు ఉంద‌ని పేర్కొంటూ.. వ్య‌భిచారం నేరం కాద‌ని తెలిపింది. ఈ కేసులో ముగ్గురు మ‌హిళ‌ల‌కు విముక్తిని క‌లిగించింది.

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన ముగ్గురు యువతులు ఓ గెస్ట్‌హౌజ్‌లో పోలీసులు నిర్వహించిన రైడ్‌లో దొరికారు. వీరిని బాధితులుగా పేర్కొంటూ, విటుడిని అరెస్టు చేసి పీఐటీఏ కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో దిందోషి సెషన్స్‌ కోర్టు.. ఈ మ‌హిళ‌ల‌ను మహిళల వసతి గృహానికి తరలించాల‌ని ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఈ మ‌హిళ‌లు కోర్టు తీర్పును స‌వాల్ చేస్తూ ఓ లాయ‌ర్ ద్వారా హైకోర్టును ఆశ్ర‌యంచారు.

ఈ కేసును విచారించిన బాంబే హైకోర్టు వీరి వాద‌నను వినింది. త‌మ సామాజిక వ‌ర్గం మొత్తం ఈ వృత్తితోనే జీవ‌నోపాది పొందుతోంద‌ని తెలిపారు. త‌మ‌ను త‌మ త‌ల్లుల ద‌గ్గ‌ర‌కు పంపాల‌ని కోరారు. వీరి వాద‌న‌లు విన్న హైకోర్టు  వ్యభిచారం నేరమని ఏ చట్టంలోనూ లేదని తీర్పు ఇచ్చింది. వీళ్ల ఇష్టానికి వ్య‌తిరేకంగా నిర్బంధం విధించ‌డం స‌రైంది కాద‌ని పేర్కొంటూ వీరికి విముక్తి క‌ల్పించింది. పీఐటీఏ-1956లో వ్యభిచారాన్ని రద్దు చేయమని ఎక్కడా చెప్పలేదని.. దానిని శిక్షార్హమైన నేరంగా పేర్కొంటూ ఎటువంటి ప్రొవిజన్‌ లేదని న్యాయ‌మూర్తి అన్నారు.

ఇలాంటి కేసుల్లో పట్టుబడిన వాళ్లకు శిక్ష విధించాలన్న నిబంధన ఏమీ లేదన్నారు. అయితే ఒక మ‌నిషిని మోసం చేసి స్వ‌ప్ర‌యోజ‌నాల కోసం పాల్ప‌డితే అది నేర‌మ‌ని పేర్కొంది. హైకోర్టు తీర్పుతో ఈ ముగ్గురు మ‌హిళలు బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు వీలు క‌లిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here