షూటింగ్ పూర్తి చేసుకున్న ఫ్యామిలీ మ్యాన్.. ఈసారి ఉగ్రవాదిగా సమంత!

గతేడాది అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ మంచి ప్రేక్షకాదరణ పొందిన విషయం తెలిసిందే. మనోజ్ బాజ్ పాయ్ ఇంటలిజెంట్ ఆఫీసర్ గా నటించిన ఈ సిరీస్. దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. హిందీ,  తెలుగుతో పాటు పలు భాషల్లో విడుదలైన ఈ వెబ్ సిరీస్ కు అన్ని చోట్ల మంచి స్పందన వచ్చింది. ఇందులో ప్రియమణి కూడా తనదైన నటనతో ఆకట్టుకుంది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ కు సీక్వెల్ గా ఫ్యామిలీ మ్యాన్ 2 తెరకెక్కుతోంది. నిజానికి ఈ వెబ్ సిరీస్ ఈ సమయానికే విడుదలకావాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడింది. ఇక తాజాగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపుల మేరకు ఫ్యామిలీ మ్యాన్ యూనిట్ చిత్రీకరణ ప్రారంభించడమే కాకుండా.. శరవేగంగా పూర్తి చేసింది. తాజాగా షూటింగ్ పూర్తయిన విషయాన్ని దర్శకులు ఇన్ స్టాగ్రామ్ వేదికగా అధికారికంగా ప్రకటించారు. ఇక ఫ్యామిలీ మ్యాన్ 2లో సమంత నటిస్తుండటం విశేషం. ఇందులో సామ్ టెర్రరిస్ట్ పాత్రలో కనిపించనుందని వార్తలు వస్తున్నాయి. అంతేకాదు.. ఈ పాత్ర కోసం సమంత తానే స్వయంగా డబ్బింగ్ చెప్పుకొనుందని సమాచారం. దీంతో ఈ వెబ్ సిరీస్ పై తెలుగు ప్రేక్షకులోనూ ఆసక్తి నెలకొంది. త్వరలోనే అమెజాన్ ప్రైమ్ లో ఈ వెబ్ సిరీస్ ను విడుదల చేయనున్నారు.

View this post on Instagram

Finally every single shot of #TheFamilyManSeason2 is done! Had to somehow pull it off during these tough times! Incredible job by our crew! @primevideoin @iamsumankumar @suparnverma @rahulgandhi9 @manojkumarkalaivanan @cameronbryson @sainisjohray @aejaz_gulab @yannickben @sumeetkotian @ketan_sodha @suveera.swetesh.stylist @castingchhabra @tusharseth09 @i_dpsingh @krunaliiii @wasim_khansaab @sunil11711 @ketkisamant @vandana8810 @suhasnavarathna @manishamakwana18 @kochar.chirag @sharankothari @soumiltiwarii @nasir5488 @kohli__utkarsha @rk_pranav @zuhair30 @_shellysharma @hiren181 @chatterjeeabhinav @the_kochikaran @dev23karan @roshan_chowdhry @ramcharantej.labani @vidhidedhia2 @ashitajha @zenishamerchant @aar.u.shirious @aparajita_atre @aarti.rajput01 @itisanu

A post shared by Raj & DK (@rajanddk) on

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here